పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/688

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

198

భారతదేశమున


క్షేమలాభములను గూర్చిన ప్రణాళికలను శాసించుటకుగాని అమలుపరచుటకు గాని ఏల ప్రయత్నింతురు? సహజముగా వారు గవర్నరు జనరలునే ఆశ్రయించి అతనిపైననే ఆధారపడి అతని చిత్తానుసారమే ప్రవర్తింతురు. గవర్నరు జనరలన్ననో బ్రిటిషు వారి కీదేశమున వ్రేళ్లు పారి పాతుకొని యున్న హక్కులను కాపాడుటయే తన పనిగా ప్రవర్తించును. మంత్రులు గూడ అందు కనుగుణముగా ప్రవర్తించునట్లు చేయును.

ఒక వ్యయము శాసనసభయొక్క వోటుకు పెట్టవలసిన తరగతిలోనిదా కాదా యని నిర్ణయించు నధికారి కూడ గవర్నరు జనరలే. అట్లు నిర్ణయించుటలో నతడు మంత్రులతో ఆలోచింపకయే తన స్వతంత్ర వివేచననే ఉపయోగింపవలెనని 38-వ శెక్షను విధించుచున్నది. ఈ విపరీతాధికారము నతడు యథేచ్ఛముగా చలాయించవచ్చును.

చట్టముయొక్క - 34 శెక్ష నును బట్టి అసెంబ్లీ శాసనసభ వోటుకు లోబడిన ఇతర వ్యయములుగూడ గవర్నరు జనరలే ప్రతిపాదింపవచ్చును. 35 వ సెక్షను ప్రకారము శాసనసభవారు నిరాకరించిన వ్యయము. తన ప్రత్యేక బాధ్యతను నిర్వహించుటకొరకు అవసరమని చెప్పి గవర్నరు జనర లా వ్యయపు మొత్తమును కోశపట్టికలో మఱల చేర్చవచ్చును. ఈప్రత్యేక బాధ్యత లనునవి 12 వ శెక్షనునుబట్టి అనిర్ణీతములుగా నున్నవి. గవర్నరుజనరలు చలాయించు ప్రత్యేక విషయముగాక ప్రత్యేక అధికారమండలములు సృజియింప