196
భారతదేశమున
బడినది. (I) ఫెడరలు రివిన్యూ ఆదాయముపైనబద్దత (చార్జి) చేయబడినట్టిది. (2) ఫెడరేషనుయొక్క రివిన్యూఆదాయములో నుండి ఖర్చు పెట్టదలచినది.
మొదటితరగతి వ్యయమునుగూర్చి ఫెడరలు శాసననిర్మాణ సంస్థ వోటుచేయుటకు వీలులేదు. అట్టితరగతిలో ఈ క్రిందివి చేరును.
1. గవర్నరు జనరలుయొక్క జీతము, అలవెన్సులు, ఆ హోదాకు సంబంధించిన ఇతరవ్యయములు.
2. ఫెడరేషను బాధ్యత వహించు ఋణవ్యయములు, వడ్డీ, ఋణతీర్మానపుఖర్చులు, తీర్మానవ్యయములు.
3. మంత్రులయొక్కయు, కౌన్సెలర్లయొక్కయు, ఫైనాన్షియల్ అడ్వైజరుయొక్కయు, అడ్వకేటు జనరలుయొక్కయు. జీతములు, అలవెన్సులు.
4. ఫెడరలుకోర్టు జడ్జీలజీతములు, అలవెన్సులు, ఇతర హైకోర్టుజడ్జీల పింఛనులు.
5. దేశరక్షణ, విదేశవ్యవహారములు, క్రైస్తవమత వ్యవహారములకు అగు వ్యయము.
6. స్వదేశసంస్థానములకును చక్రవర్తి మకుటమునకును గల సంబంధవ్యవహారములందు చేయబడుఖర్చులు.
7. ఫెడరలు రెవిన్యూపైనబద్ధత (చార్జి) చేయబడునట్లు గవర్నరు జనరలు నిర్ణయించు ఇతరవ్యయములు.