బ్రిటీష్‌రాజ్యతంత్రము
195
5. ఇండియాలో నివసించని వారిపైన దేశవాసుల పైనకన్న హెచ్చుపన్ను విధించునట్టి లేక ఇండియాలో రిజస్టరై యుండనట్టికంపెనీలపైన ఇండియాలోనేపూర్తిగా మేనేజిచేయబడని కంపెనీలపైన ఇండియాలోనే రిజస్టరై మేనేజిచేయబడు కంపెనీల కన్న హెచ్చుపన్ను విధించునట్టి,
6. ఇంగ్లాండులో పన్ను విధింపబడ తగియున్న కారణమున ఫెడరలు ఆదాయపుపన్ను భారము తొలగించుటకు సంబంధించినట్టి శాసనములు.
ఇట్లు ఫెడరలు శాసన నిర్మాణసంస్థ కేవలము, అధికార విహీనమగు సంస్థగా నున్నది. దేశముయొక్క ద్రవ్యపద్ధతి యందుగాని విదేశవ్యవహారములందుగాని ఈసంస్థకు పలుకుబడి యుండదు. గవర్నరు జనరలు అనుజ్ఞను ముందుగా పొందనిదే ఏముఖ్య విషయమును గూర్చియు శాసించుటకు వీలులేదు. అట్టి అనుజ్ఞ అవసరములేని విషయములందు గూడ గవర్నరు జనరలు తన స్వతంత్ర వివేచన నుపయోగించి శాసననిర్మాణ సంస్థయొక్క తీర్మానమును ప్రత్యాఖ్య (వీటో) చేసి త్రోసివేయవచ్చును. పొరబాటున ఆత డట్లుచేయక విడిచినను శాసన మైన 12 నెలలలో ఆంగ్లరాజు దానిని ప్రత్యాఖ్యచేసి త్రోసివేయవచ్చును.
ద్రవ్యవిషయములందు ఫెడరలు శాసన నిర్మాణ సంస్థయొక్క అధికారము లింకను సారహీనములై యున్నవి. దేశముయొక్క వార్షికవ్యయము రెండుభాగములుగా విభజింప