Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/684

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

194

భారతదేశమున


వీనికగు వ్యయములనుగూర్చి నిర్ణయించుటలో పాల్గొనుటకైనను అధికారములేదు. దేశరక్షణ, విదేశవ్యవహారములు క్రైస్తవ మతవ్యవహారముల పరిపాలనను గవర్నరు జనరలే స్వయముగానడుపవలెను. దాని కతడే పెత్తనమువహించవలెను. గవర్నరుజనరలు ఆమోదించనిదే ఏచిత్తుచట్టము శాసనముకాగూడదు. ఉభయశాసనసభలలోను ఈ క్రింద వివరింపబడిన ముఖ్యవిషయములనుగూర్చిన చిత్తుచట్టముగాని సవరణగాని ప్రవేశపెట్టుటకు ముందుగా గవర్నరు జనరలు అనుజ్ఞను పొంది యుండవలెను.

1. బ్రిటీషు ఇండియాకు వర్తించు ఏపార్లమెంటు శాసనమునుగాని రద్దుపర్చునట్టియు లేదా మార్చునట్టియు లేక అట్టి శాసన నియమములకు విరుద్దమగునట్టి,

2, గవర్నరు జనరలు చట్టమునుగాని ఆర్డినెన్సు శాసనమునుగాని రద్దుచేయునట్టి లేదా మార్చునట్టి లేదా అట్టిశాసన చట్టనియమములకు విరుద్ధముగా నుండునట్టి,

8. గవర్నరు జనరలు తనస్వతంత్ర వివేచన నుపయోగించి చర్య తీసుకొనవలసిన విషయములకు సంబంధించినట్టి,

4. పోలీసు సిబ్బందికి సంబంధించినట్టి లేదా ఐరోపావారికి సంబంధించిన క్రిమినలు ప్రొసీజరుకు సంబంధించినట్టి చట్టమును రద్దుచేయునట్టి లేదా మార్చునట్టి లేదా అందుకు సంబంధించినట్టి,