బ్రిటీష్‌రాజ్యతంత్రము
193
నింప వచ్చునని జాయింటు పార్లమెంటరీ కమిటీవారు సెలవిచ్చుటలోనే వారియొక్క నిజోద్దేశములు బయల్పడుచున్నవి.
ఈసంస్థానాధీశులపైన ఇతరులు దాడివెడలకుండగను దేశములో కల్లోలము కలుగకుండగను సంరక్షించు బాధ్యతను బ్రిటిషువారు వహించియున్నారు. ఈసంస్థానాధీశులు ఎంత నిరంకశముగ పరిపాలించినను అడుగువారు లేరు. సంస్థానాధీశునిగౌరవమునకు హక్కులకు భంగము కలుగకుండ చూచు బాధ్యత గవర్నరుజనరలుదే. ఈనూతనమైన ప్రత్యేక బాధ్యతయు దేశరక్షణవిషయములో గవర్నరు జనరలుకు గల ప్రత్యేక బాధ్యతయు కలసి ఈ 'ఫ్యూడలు' పరిపాలకవర్గము వారికి క్రొత్తబలమును, సంరక్షణయు కలిగించినవి.
IV
ఫెడరలు శాసననిర్మాణ సంస్థయొక్క అధికారములు.
శాసనసభలందు తమ వశవర్తులే అధిక సంఖ్యాకులుగా నుండునట్లు చేసికొనియుగూడ బ్రిటీషు సామ్రాజ్య తత్వజ్ఞులు ఈసంస్థకు నిజముగా ఉపయోగింపగల శాసన నిర్మాణమునందుగాని ద్రవ్యవ్యవహారములందుగాని నిజమైన అధికారము నిచ్చుటకు వెనుదీసినారు. రాజకీయముగా అత్యంతప్రధానములైన రెండుశాఖలగు దేశరక్షణ (సైన్యము) విదేశ వ్యవహారములు ఫెడరలు శాసన నిర్మాణసంస్థయొక్క అధికారమునకు లోబడియుండవు. శాసనసభలకు ఈవిషయములను గూర్చి శాసనములు చేయుట కధికారము లేకపోవుటయేగాక