పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

భారత దేశమున


పురోభివృద్ధికి తోడ్పడుట ఇతర భారతీయసంస్థలను సంరక్షించి జనసామాన్యములోని అన్నితరగతుల వారికి తగు జీవనాధార . వృత్తులు కల్పించుటయు నీ యౌన్నత్యమునకు కారణములు." (Reform Pamphlet No. 9).

ఆనాడు రాజ్యమేలిన మహారాష్ట్ర పరిపాలకులలో రాణీ అహల్యాబాయి చాలా ప్రసిద్దిచెందిన మహారాజ్ఞి. ఆమె పరిపాలనమున దేశ మనుభవించుచుండిన శాంతిని సౌఖ్యమును సర్‌జాన్ మాల్కలం వర్ణించియున్నాడు. తనప్రజల కందరికిని క్షేమలాభములు కలిగించుటయే ఈమహారాణియొక్క పరమ లక్ష్యముగ నుండెను. సాహుకారులు, వర్తకులు, కర్షకులు, రైతులు, ధనవంతులై యభివృద్ధి జెందుటను వీక్షించుటయన్న ఈమెకు పరమసంతోషము. మాళవరాజ్యమున కీమె పరిపాలనము మేలుబంతిగనుండెను. ఈమె అనేకకోటలు నిర్మిం చెను. వింధ్యపర్వతముల కడ్డముగా నొకవిశాలమగు రాజబాటను నిర్మించెను. మహారాష్ట్ర దేశములోని రాజులెల్లర కీమెయందు మిక్కుటమగు భక్తి. (Malcolm's History of Central India Vol. I. P. 176. 195.).

ఆనాటి మహారాష్ట్రరాజ్య సమ్మేళనములోని ప్రముఖులలో బీరారురా జొకడు. ఈతని రాజ్యముకూడ మంచిస్థితిలో నుండెను. ఈజిల్లాలలో పర్యటనము జేసిన ఐరోపాజాతి బాటసారు లీరాజ్యముయొక్క సారవంతమగు భూమి, వాణిజ్యము, ప్రజల యభివృద్ధినిగూర్చి పుష్కలములగు పాడిపంటలు గొప్ప దేవాలయములు, నీటి వనరులు ప్రజల యభివృద్ధినిగూర్చి వర్ణించియున్నారు.