Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

45


VII

పశ్చిమోత్తరపరగణా

“రాంపూరు రాజ్యములోనుండి పోవునప్పుడు అచ్చటి కృషి, సంపద దృష్టి నాకర్షింపక మానదు. ఒక్క జేనెడుభూమియైన వదలకుండ సాగుచేయబడుచుండెను. ఋతువు అనుకూలముగ లేకపోయినను జిల్లాలోని భూమియంతయు పంటతో నిండియుండెను. దీనివలననే యిచ్చటి రైతుల మంచిస్థితి వెల్లడియగుచున్నది. నవాబు మైదుల్లాఖానుయొక్క వ్యవహార దక్షతను అందరు మెచ్చుకొనుచుండిరి. ఇతడు విద్యాధికుడు, ఉదారుడు నగు భూస్వామి. దేశాభివృద్ధికొరకు తానేచాలాసొమ్ము వెచ్చించుచుండెను. సాగుకొరకు గొప్ప నిర్మాణములు విశేషధనము కావలసినప్పుడెల్ల ఇతడు విరివిగా ఖర్చుపెట్టుటకు వెనుదీయడు. కాలువలు త్రవ్వించెను. చిన్న నదుల కడ్డుకట్టలుకట్టి నీటిని పొంగించి పరిసర ప్రదేశములను సారవంతముచేసి పల్లము సాగుకు అనుకూలముగా జేయుచుండెను. తన ప్రజలను చక్కగా పరిపాలించి కాపాడుచుండెను. అన్నివిషయములందు నింకను చక్కగా పాటుపడునట్లు వారి నితడు ప్రోత్సహించుచుండెను. రోహిలఖండముయొక్క పరిపాలన విషయములో రోహిల పరిపాలకుల పద్దతిని బ్రిటిషుపరిపాలనాపద్దతితో పోల్చిచూచినచో నీనాగరకబ్రిటిషుపరిపాలనకన్న 'అనాగరక' రోహిలపరిపాలనమే ఎక్కువ బాగుండెననుటకు సందియము లేదు. ఈ రాజ్యము బ్రిటిషువారిచేతిలోనికి వచ్చిన ఏడేండ్లలో దేశాదాయములో 2 లక్షలరూపాయలుమాత్రము వృద్ధిజెందెను. తరు