పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

43


సంపద, సమృద్ధియైన పాడిపంటలు నింకేభాగమునను నాకు గనబడ లేదు. పీష్వాయొక్క రాజధాని నగరమగు పూనాపట్టణము మిక్కిలి ధనవంతమైన వర్తకస్థానము. కృషికి అనుకూల పరిస్థితులులేని ఈ దక్షిణాపథము (డెక్కన్)లో నింతటి కృషి సంపదయుండుట యాశ్చర్యజనకముగా నున్నది” అని పలికినాడు. హోల్కారు పరిపాలనలో నున్న ఇంకొక మహారాష్ట్ర రాజ్యభాగమును గూర్చి ఇతడే ఇట్లు చెప్పినాడు “మాళవరాజ్యము క్రూరజాతుల చేతులలోబడి పాడైనదిగాని ఆస్థితిలో కూడా యీ రాష్ట్రములో ధనకనకవస్తు వాహనములతో గొప్ప సాహుకారులతో నిండి గొప్ప వ్యాపారమునకు ఆటపట్టులగు మహానగరములు నిరంతరాయమగు ఎగుమతి దిగుమతి వ్యాపారము నాకు గనబడినది. భారతదేశములో నెల్ల యెడలను వ్యాపార భీమాకార్యాలయములు చక్కగా పనిచేయుచునే యున్నవి. పైన చెప్పిన దక్షిణ మహారాష్ట్ర జిల్లాలు వాణిజ్యకృషి విషయములందు పూర్వపు ఔన్నత్యముకన్న మన బ్రిటిషుపరిపాలనమున హెచ్చుఅభివృద్ధిగాంచునని నాకు తోచదు. మొత్తముమీద మహారాష్ట్ర పరిపాలన శాంతి యుతముగను ప్రజానురంజకముగనుండెను. ఈ ఔన్నత్యమునకు ముఖ్యకారణము వ్యవసాయ జీవనమన్న హిందువులకు గల ప్రీతియే. పట్టణములను గ్రామముల నుద్దరించి అభివృద్ధిచేయు పద్ధతి మనకన్న వారికెక్కుడు చక్కగా తెలియుననుటకు సందియము లేదు. ధనవంతులకు ప్రోత్సాహమిచ్చుట పెట్టుబడిని వృద్ధిచేయుట అన్నిటికన్నను ముఖ్యముగా గ్రామ