పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/671

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

181


చట్టమునకు ప్రైజులా ప్రైజుకోర్టులకు భంగకరమగు నట్టియు శాసనములను చేయుటకు ఫెడరలు సంయుక్తరాష్ట్రయ శాసనసభల కధికారమున్నట్లుగా అన్వయింపబడరాదు.

రాజ్యాంగములో నెట్టిమార్పుచేయుటకును భారతదేశ శాసనసభల కధికారము లేదనుసంగతి 308 వ సెక్షను స్పష్టముగా బయల్పరచుచున్నది. ఎన్నికలలో వోటుచేయు హక్కును హెచ్చుమంది కివ్వవలసినదనిగాని ఎన్నికలపద్ధతిలో కొన్నిమార్పులు కలిగించవలసినదనిగాని శాసనసభలయొక్క నిర్మాణమునందు ప్రమాణమునందు కొంతమార్పు కలిగించవలసిన దనిగాని ఈ రాజ్యాంగము స్థాపింపబడిన పదిసంవత్సరములైన తరువాత మనశాసనసభలు శిఫారసుచేయుచు కొన్నితీర్మానములను గావింపవచ్చును. అయితే అట్టి ప్రతిమార్పును బ్రిటీషు పార్లిమెంటువారివలన ఆమోదింపబడవలెను.

భారతదేశ వ్యవహారములను నడుపుటకు , పై తనిఖీచేయుటకు, అదుపులోనుంచుటకు ఇండియా రాజ్యాంగ కార్యదర్శికిగల అధికారముల ద్వారా బ్రిటిషుపార్లమెంటు తన సర్వాధికార ప్రభుతను చలాయించును. భారతదేశ వ్యవహారములకు సంబంధించినంతవరకు ఆంగ్లచక్రవర్తి. మకుటమునకుగల అధికారములనెల్ల అమలు జరుపుటకు బాధ్యతవహించు ప్రతినిధి, ఇండియారాజ్యాంగ కార్యదర్శియై యుండును, గవర్నరు జనరలు అతని అదుపు ఆజ్ఞలక్రిందనే యుండి అతని సూచనలనెల్ల శిరసావహించవలెను. ఇందువలన భారతదేశమునకు బ్రిటీషు దీవులకు గలప్రధానరాజకీయ సంబంధము