180
భారతదేశమున
భారతదేశ ప్రభుత్వముయొక్క అన్ని ముఖ్యవిషయములందలి పరిపాలనాపద్దతిని అతడే నిర్ణయించి అతడే నడుపును. భారతదేశములోని బ్రిటీషు సివిలు మిలిటరీ ఉద్యోగ వర్గములోని పెద్దపెద్ద ఉద్యోగులను అతడే నియమించును. వారి ఉద్యోగషరతులను గూడ అతడే నిర్ణయించును. భారతదేశముయొక్క ముఖ్య పరిపాలనాధికారి (Executive) యగు గవర్నరుజనరలు అన్ని విషయములందును ఇండియా కార్యదర్శి కే బాధ్యత వహించును. బ్రిటీషు పార్లమెంటుయొక్క ప్రభుతను సర్వాధికారము నీక్రొత్త రాజ్యాంగ మావంతయైన కదల్పలేదు. రాజ్యాంగచట్టముయొక్క 2 వ సెక్షను భారతదేశమునకు సర్వాధికారి బిటీషుపార్లమెంటే యను సంగతిని స్పష్టముగా సూచించుచునే యున్నది. ఈ సంగతిని 110 వ సెక్షను ఇంకను స్పష్టపరచుచున్నది.
ఈ చట్టములోని సంగతులెవ్వియు, (1) బ్రిటీషు ఇండియాకు, అనగా భారత దేశములోని బ్రిటీషుపరగణాలకుగాని అందులోని భాగములకుగాని చట్టములు చేయుటకు బ్రిటీషు పార్లమెంటువారికి గల అధికారమునకు భంగము కలిగించు చున్నట్లు ఎంచబడరాదు.
(2) ఆంగ్లరాజును గూర్చి, రాజకుటుంబమునుగూర్చి రాజవారసత్వమునుగూర్చి భారతదేశములో ఏభాగమునందుగాని చక్రవర్తి, మకుటమునకుగల అధికారమునకు ప్రభుతకు భంగము కలిగించునట్టి లేదా బ్రిటిషు జాతీయతకు సైనిక చట్టమునకు వైమానికదళ చట్టమునకు, నావికాక్రమశిక్షణ