182
భారతదేశమున
నందీ క్రొత్త రాజ్యాంగ మెట్టి మార్పును కలిగించియుండ లేదను సంగతి స్పష్టమగుచున్నది. సామ్రాజ్యతత్వప్రాబల్యము యొక్క పునాదిరాయి ఎప్పటివలెనే స్థిరముగా నుండును. భారతదేశ మెప్పటివలెనే పారతంత్ర్యమున పాలిత రాజ్యముగానుండి విదేశసామ్రాజ్య ప్రభుత్వమువలన పరిపాలింప బడుచు కొల్లగొనబడుచుండును.
ఏడవ పరిచ్ఛేదము :
నూతన ఇండియా ఫెడరల్ రాజ్యాంగము
I
ఫెడరేషను - అఖిలభారత రాజ్యాంగసమాఖ్య.
నూతనరాజ్యాంగచట్టముబ్రిటీషు పరగణాలును స్వదేశ సంస్థానములును కలిసినఒక రాజ్యాంగ సమాఖ్యగావించి అఖిలభారత సంయుక్తప్రభుత్వము లేక "ఫెడరేషను" అను క్రొత్త రాజ్యాంగమును స్థాపించుచున్నది. “ఫెడరలు" లేక సంయుక్త శాసననిర్మాణ సంస్థలో “అసెంబ్లీ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్” అనబడు రెండుశాసన సభలుండును. సంయుక్త రాజ్యముయొక్క పరిపాలనాధికారము ఆంగ్లరాజప్రతినిధియగు గవర్నరు జనరలువలన చలాయింపబడును.
7 వ సెక్షను ప్రకారము భారతదేశ పరిపాలనాధికారము (కార్యనిర్వహణము) గవర్నరు జనరలునందు నెలకొల్పబడినది. ఈ అధికారము నతడు తన 'స్వతంత్ర వివేచ