పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/660

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

170

భారతదేశమున


ర్నరు జనరలుకు దాసానదాసులై యుండి అతని చెప్పుచేతలలోని మంత్రులకే అండయైయుండి అతని కెదురుదిరిగి ప్రజల యిష్టానుసారముగా వర్తించు మంత్రులను ప్రతిఘటింతురు.

ఈవిపరీతపు బాధ్యతాయుత ప్రజాప్రభుత్వమునందు ప్రజాప్రతినిధులకు, ప్రజలకు నిజమైన అధికారములుగాని పలుకుబడిగాని లేనందున నీరాజ్యాంగము దేశప్రజలు దారిద్ర్యమునుండి వెలువడి లాభము పొందుట కెట్టి యవకాశమును కలిగింపకుండుటయేగాక దేశదాస్యబంధనములను మరింత గట్టిజేసి బ్రిటీషువారి లాభముకొరకే పాలింపబడు పద్ధతులను శాశ్వతముగా నిలిపి యుంచుచున్నది.

“నూతన యిండియా రాజ్యాంగచట్టము స్థాపింపజూచు ఫెడరేషనులో చేర్చబడనున్న బ్రిటీషు పరగణాలును స్వదేశ సంస్థానములును రాజ్యాంగస్వభావమునుబట్టి పరస్పరవిరుద్ధమైన రాజ్యభాగములు. బ్రిటిషు పరగణాలలోని ప్రజాప్రభుత్వ పద్దతులందు బ్రిటిషు సామ్రాజ్యమునకు వ్యతిరేకములుగా పరిణమింపగల శక్తులను కొంతవరకైన సంస్థానములు ప్రతిఘటించి ఆటంకములు గలిగించగలవను ఆశతోనే ఈఫెడరేషను నిర్మించుటకు బ్రిటిషువారిష్టపడియున్నారు. ఈఫెడరేషను నిర్మాణములో తమ అంతర్జాతీయ ప్రభుత్వ వ్యవహారములందు కొంతవరకైన స్వేచ్చను స్వాతంత్ర్యమును సంపాదించుటకు సంస్థానాధీశులు ప్రయత్నించి తీరుదురు. బ్రిటిషు సార్వభౌమత్వముక్రింద సామంత రాజ్యములుగా నుండుట యనగా తమ సంస్థానములో తమ పరిపాలనకు ఎదురు తిరుగువారినెల్ల