Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/661

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

171


రను అణచివైచుటకు బ్రిటిషు సామ్రాజ్యము తమకు తోడ్పడునను ధైర్యముతో నిరంకుశముగా దుష్పరిపాలన చేయుటయే యని ఈ సంస్థానాధీశుల యూహ.

భారతదేశకేంద్రప్రభుత్వమునకు పరిపూర్ణమైన బాధ్యతాయుత ప్రజాపరిపాలనమును ప్రసాదింపక తప్పించుకొనుటకొరకే ఈఫెడరలురాజ్యాంగ ప్రణాళిక నిర్మింపబడినదని ఒప్పుకొనక తప్పదు. దేశరక్షణ, సైనిక వ్యవహారములు భారతదేశ ఫెడరలు రాజ్యాంగమునకు వశము చేయకపోవుట చారిత్రకముగా నెంతసమంజసముగా కనబడుచున్నను ఇట్లు మినహాయించుట వలన బాధ్యతాయుత ప్రజాపాలన మనునది ఎంత సారహీనమైనదిగా నున్నదో వేరే చెప్పనక్కరలేదు.

తమ సంస్థానములతో నెట్టి సంబంధమును లేక కేవలము బ్రిటీషు పరగణాల కే సంబంధించిన వ్యవహారముల చర్చలందు ఈ సంస్థానాధీశుల ప్రతినిధులు పాల్గొనుటను బ్రిటిషు పరగణాల ప్రతినిధు లెంతమాత్రము హర్షింపజాలరనుట నిశ్చయము. ఈ సంస్థానాధీశుల ప్రతినిధు లట్లు పాల్గొనక పోయినచో వీరిని కలుపుకొనగా మెజారిటీ పక్షముకలిగియుండు ప్రభుత్వవర్గము వీరులేనిచో మైనారిటీ పక్ష ప్రభుత్వమై పరిణమించు విపరీతపు దృశ్యము తటస్థింపవచ్చును.

ఇట్టి విరుద్ధపు పద్ధతులపైన నిర్మింపబడిన ఫెడరేషన్ ఎంత వరకు చక్కగా నడచుననునది ఊహించుట సులభమైనపని కాదు. ఇది చక్కగా నడచినచో అది బహుశా బ్రిటిషు పరగణాలలోను సంస్థానములలోను అభివృద్ధికి వ్యతిరేకములగు