బ్రిటీష్‌రాజ్యతంత్రము
169
ఆయధికారములెల్ల రాజ్యాంగ చట్టమునందు బ్రిటీషు రాజప్రతినిధియగు గవర్నరుజనరలుకే యొసగబడి అతడు కేవలము సర్వాధికారిగా చేయబడినాడు. ఈ గవర్నరు జనరలు తన చర్యలకు భారతదేశీయులకు బాధ్యత వహింపక ఇంగ్లాండులోని బ్రిటిషు పార్లమెంటుయొక్క మంత్రియగు ఇండియా రాజ్యాంగ కార్యదర్శికే బాధ్యతవహించి బ్రిటీషు సామ్రాజ్యముయొక్క లాభము నిమిత్తము అతడు జారీచేయు తాఖీదుల కనుగుణముగా ప్రవర్తించును. భారతదేశపు పరిపాలనలో పనిచేయు ఐ. సి. యస్. ఉద్యోగులు వారి యజమానులగు మంత్రులకన్న హెచ్చు పలుకుబడియు అధికారములు గలిగి యుందురు. వారు ఈ మంత్రులమాట వినకపోయినను అడుగువారు లేరు.
ఇట్లు అధికారవిహీనమై నామ మాత్రావశిష్టముగ నుండు మంత్రులు తాను చలాయించు స్వల్పపు అధికారములందైనను శాసనసభలందలి ప్రజాప్రతినిధులకు బాధ్యులై వారి యిష్టానుసారముగ ప్రవర్తింతురాయన్నచో, సర్వాధికారియైన గవర్నరు జనరలు కన్నుసన్నల మెలగినంతకాలము మంత్రిమండలి ప్రజాప్రతినిధులతో నిమిత్తము లేకుండా వర్తించుట కీ రాజ్యాంగము అవకాశము కల్పించుచున్నది.
శాసనసభలయందు జనసామాన్యముయొక్క ప్రతినిధులకన్న సంస్థానాధీశులయొక్కయు, ధనవంతులయొక్కయు ప్రతినిధులకు హెచ్చు పలుకుబడి యుండులాగున శాసనసభలు నిర్మింపబడినవి. ఈ సంస్థానాధీశులు, నీధనవంతులు గవ