168
భారతదేశమున
బంధించిన కోశముయొక్క ఆదాయ వ్యయవిధానమును శాసనసభ చేతులలో నుండదు. అట్లయిన సైనికవ్యయము తగ్గుటెట్లు ? సైనికవ్యయము తగ్గనిచో తక్కిన ప్రజాక్షేమకర సౌకర్యములకు పైక మెక్కడిది? ఇట్టితరి తక్కిన శాఖలుప్రజల వశమైన లాభమేమి ? భరతఖండముయొక్క ఆర్థిక పరపతిని గూర్చిన ప్రత్యేక బాధ్యతల నిర్వహణమునకు వలసిన మినహాయింపులు రక్షణలునను పేరున భారతీయ శాసనసభల ఆర్థిక స్వాతంత్ర్యమును నిష్ప్రయోజనముగ జేసినచో, ప్రజల క్షేమమున కావశ్యకములుగాని, వ్యయములను తగ్గించి వారి క్షేమమున కావశ్యకమగు కార్యములకు హెచ్చుసొమ్ము వ్యయముచేయుటకు శాసనసభలకు శక్తి యెట్లు గలుగును ! అట్టిశక్తి లేనిచో క్రొత్త ప్రభుత్వమువలన ప్రజలకేమి లాభము కలుగును? కోశాగారముయొక్క తాళపుజెవులు చేత నిడికొన్న నిరంకుశ ప్రభుత్వము నాశ్రయించు పద్దతులును అందువలని యరిష్టములును పోవునా ! ఇట్లే కోశముయొక్క ముఖ్యాదాయ వ్యయములపైన నధికారములేని ఆర్థికశాఖ మంత్రియు దేశరక్షణ వ్యవస్థపైన నావంతయు అధికారములేని స్వదేశ వ్యవహారముల మంత్రియు, పేరునకు మంత్రులై యుందురుగాని నిజమైన అధికారములు వీరికుండవు. బాధ్యతాయుత ప్రజా ప్రభుత్వమునుబట్టి ప్రజా ప్రతినిధుల శాసనసభలకును, వారికి బాధ్యత వహించి పాలింపవలసిన మంత్రి మండలికిని ఉండవలసిన శాసన నిర్మాణాధికారములందును పరిపాలనాధికారములందును ముఖ్యమైన అధికారములెల్ల మినహాయింపు చేయబడి,