166
భారతదేశమున
లును అసలే ప్రజాప్రభుత్వపద్ధతులులేని స్వదేశసంస్థానములును గలిసి ఒక ఫెడరలు రాజ్యాంగముగా చేయబడుచున్నవి. దీనివలన క్రొత్తరాజ్యాంగమునందలి కేంద్రశాసన సభలలోని ప్రజాప్రతినిధుల పలుకుబడికి భంగము వాటిల్లి తీరుననుటకు సందియములేదు. ఏలనన సామ్రాజ్యప్రభుత్వము వారికిని సంస్థానాధీశులకును సంధిసమయములు జరిగియున్నందున సంస్థానములవారు శాసనసభలందు ప్రతి విషయమునను సామ్రాజ్య ప్రభుత్వమువారి పక్షమునే యవలంబించి తీరుదురు. పూర్వమునుండియు నున్న “నామినేటెడ్ మెంబర్ల"నబడు నియామక శాసనసభ్యులవలెనే ప్రజాప్రతినిధులకును, ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖలకును, అభిప్రాయభేదము కలిగినప్పుడు సంస్థాన ప్రతినిధులు కార్యనిర్వాహక వర్గమునకు తోడ్పడి శాసనసభలలోని ప్రజా ప్రతినిధుల యభిప్రాయములను, తీర్మానములను, మన్నింపవలసిన యగత్యము లేకుండగ జేయగలరు. బ్రిటీషు పరగణాలతోపాటు సంస్థానములును రాజ్యాంగ ధర్మబద్దములై, ప్రజాహితైక ప్రభుత్వములై, కేంద్రశాసన సభలందలి ప్రజాప్రతినిధులకు కార్యనిర్వాహక వర్గమువారు అన్ని విషయములలోను బాధ్యత వహించిననే ఫెడరలు విధానము భారతీయులకు లాభకారి యగును గాని లేనిచో, జతకుదురని యెద్దుల వ్యవసాయమువలె నిదియు నుండును. ఫెడరలు రాజ్యాంగ విధానమున అన్ని సంస్థానములు కలిసిన సమ్మేళన మొకభాగముగను, బ్రిటీషు పరగణా లొకభాగముగను రాజ్యాంగ సమాఖ్యగా చేయబడినచో కొంతవరకునైన