Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/655

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

165


గములో అనేక క్రొత్త నిరోధములు కల్పింపబడినవి. ఈదేశములో వర్తకముచేయు బ్రిటీషువారి విషయమున పెట్టుబళ్ళు పెట్టిన బ్రిటీషువారి విషయమున శాసనసభలు విచక్షణాయుత శాసనములు చేయకుండు నెపమున వారి కనేక ప్రత్యేక విశేషహక్కులు కలిగించబడినవి. దేశమునకు ఆర్ధికముగా అనుపయోగమైన సైనిక వ్యయమును సివిలు పరిపాలన వ్యయమును ఆవంతయైన తగ్గించుటకు క్రొత్తరాజ్యాంగమునుబట్టి వీలులేదు. జాతీయాభివృద్ధికరములగు శాఖలను వృద్ధిచేయుమార్గముల కిది దారిచూపుటలేదు. వీనియన్నిటికినితోడు సంస్థానాధీశులయొక్కయు పెద్దజమీందారీ భూస్వాములయొక్కయు అధికారములను పలుకుబడిని గట్టిచేసి భారతదేశ రాజకీయములందు వారికొక ప్రధానస్థానము నిచ్చుచున్నది.

ఇట్లు ఈక్రొత్తరాజ్యాంగము నేపక్కనుండి పరికించినను గూడ అది భారతదేశ ప్రజలపైన నింగ్లీషు సామ్రాజ్యతత్వము తీసిన దెబ్బగానే కనబడుచున్నది. భారతదేశమును తన గుప్పిటిలో పెట్టుకొనిన బ్రిటీషు సామ్రాజ్యతత్వముయొక్క ఇనుప పిడికిలి నింకను బిగువుగాచేసి దేశమును బంధించుటకు క్రొత్తశృంఖలములను నిర్మించుచున్నది.

II

ఫెడరల్ రాజ్యతంత్రము

నూతన రాజ్యాంగ చట్టమునుబట్టి కొంతవరకైన బాధ్యతాయుత ప్రజాప్రభుత్వ పద్ధతులుగల బ్రిటీషు పరగణా