పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/657

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

167


పైనచెప్పబడిన చిక్కులు తొలగవచ్చును. గాని 600 స్వదేశ సంస్థానములలో ఎన్ని సంస్థానములు తమ ప్రజల మేలును తలిచి, పరిపాలించగలవో చెప్పుట కష్టము. అప్పుడుకూడ తగవులు రాకమానవు. ఇండియా చట్టమునుబట్టి లెక్కలేనన్ని విశేషాధికారములు గవర్నరు జనరలున కొసగబడినవి. దేశ రక్షణపైన, దానికి సంబంధించిన ఆదాయవ్యయములపైన ఖజానాయొక్క తాళపు జెవులపైన, దేశముయొక్క అభివృద్ధికి గావలసిన సర్వ విషయములపైన, శాసనసభలకు మంత్రులకు ఆవశ్యకములగు అధికారములు లేకుండచేయుటయే గాక గవర్నరు జనరలును సర్వాంతర్యామిగజేసిరి. నిరంకుశ పరిపాలకుడు తలచుకొన్నచో పరిపాలనమునందు శాంతిభద్రతలకు సంబంధించని విషయమేది? ఆర్థిక పరపతికి సంబంధించని శాసనమేది? ఆదాయవ్యయ ప్రణాళికయందు శాసన సభ్యులేర్పరచిన పన్నులపద్దతిని వ్యయ విధానమును గవర్నరు జనరలీ కారణమున విఫలము చేయవచ్చును. శాసనసభ యిష్టపడక పోయిన నేదో యొక సంస్థానమునగాని పరగణాలోగాని శాంతి భద్రతలకని అత్యధికధనము సేకరింపవచ్చును. నిజముగ నేడుభారతీయులు స్వరాజ్యమేల కోరుచున్నారో ఆయా ఆర్థిక సాంఘిక సంస్కరణములెల్ల పై కారణమువలననే గగన కుసుమములైపోవును.

నేడు ప్రభుత్వాదాయములో సగము మ్రింగివేయుచున్న సైనిక వ్యవస్థ, దేశరక్షణకు సంబంధించిన విషయము, గవర్నరు జనరలు వశముననుండు గోపురపుపెట్టె. దానికి సం