Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/651

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

161


నుంచుట కీక్రొత్తరాజ్యాంగము ప్రయత్నించుచున్నది. అందువల్లనే సంస్థానాధీశులకును జమీందారులకును ఈరాజ్యాంగ ప్రణాళికలో నింతప్రాముఖ్యత యొసగబడి వారికి విశేషహక్కు లివ్వబడినవి. ఈఉద్దేశముతోనే 'ఫెడరేషను' లేక సంయుక్త ప్రభుత్వములో ప్రజాసామాన్యపు ప్రతినిధులకు ప్రతిపక్షులుగానుండుటకు సంస్థానాధీశులును వారినియామకులును నిలుపబడినారు. మఱియు ముఖ్యమైన రాష్ట్రములలో ప్రజాభిప్రాయమును తృణీకరించుటకు మామూలు ప్రజాప్రతినిధుల శాసనసభలుగాక జమీందారులకు ధనికులకు ప్రవేశము కలిగించుటకు 'కవున్సిళ్ళు' అను పేరున అదనపు శాసనసభలు నిర్మింపబడి, వానికి ప్రజాప్రతినిధుల "అసెంబ్లీ” సభలతో సమానమైన అధికారము లివ్వబడినవి. దేశముయొక్క ఆర్థికాభివృద్ధికి ఆటంకము కలిగించుటకు మనదేశ ప్రజల సామాన్య స్వాతంత్ర్యములు (సివిలు లిబర్టీస్ ) తీసివేయబడుటకు కారణమైనట్టియు బ్రిటీషు సామ్రాజ్యతత్వము వా రింతవరకు అవలంబించియున్న స్వాతంత్ర్య నిరోధక విధానముయొక్క సహజపరిణామమే యీ క్రొత్తరాజ్యాంగము.

బ్రిటీషువారి స్వప్రయోజనార్ధము భారతదేశ ఆర్థికాభివృద్ధి అరికట్టియుంచబడినది. బ్రిటీషు వస్తువులు చెల్లుబడి చేసికొనుటకును బ్రిటీషువారు మూలధనమును పెట్టుబళ్ళనుపెట్టి వడ్డీని లాభమును ఆర్జించుకొరకును వారి పరిశ్రమలకు ముడివస్తువులు సరఫరా చేయుకొరకును భారతదేశము నుపయోగించుకొనుచున్నారు. గ్రామకుటీర పరిశ్రమలు చేతి