160
భారతదేశమున
దేశమును కత్తితోనే సంపాదించియున్నాము; దానిని మనము కత్తితోనే నిలుపుకొని తీరుదుము. మన బ్రిటీషుసరకులను విడుదల చేసికొనుటకును ముఖ్యముగా లంకాషైరు బట్టలను చలామణి చేసుకొనుటకును ఉపయోగించుకొనుటకే మనము భారతదేశమును మనచేతులలో నుంచుకొన్నాము" అని స్పష్టముగా చెప్పివేసినాడు. నేటి అంతర్జాతీయ వ్యవహారముల ఒత్తిడిలో బ్రిటీషువారు తమ ముప్పు గడువబెట్టుకొనుటకు భారతదేశమును శాశ్వతముగా తమ కాధారముగా నుంచు కొనజూచుచున్నారు.
ఒకవంక ప్రపంచములోని క్లిష్టపరిస్థితులు తీవ్రరూపము దాల్చుచుండుట వలనను ఇంకొకవంక పారతంత్ర్యమును సహింపక పోరాడుచున్న భారతదేశప్రజల తిరస్కారము వర్ధిల్లుచున్నందునను, బ్రిటీషు వారు భయపడి, ఈ దేశములోని బ్రిటీషు పరిపాలనకు పునాదియగు పశుబలమును గట్టి చేసికొన జూచుచున్నారు.
అఖిలభారతకాంగ్రెస్ కమిటీవారు ప్రచురించిన పుస్తకమున డాక్టర్ అహమ్మదు గారిట్లు వ్రాసినారు:
"దేశములోని జనసామాన్యము స్వతంత్రులగుట కిష్టపడక వారిని శాశ్వతముగా అణచియుంచి స్వప్రయోజనము పొందజూచు మొగలాయి జాగీర్దారీ పద్దతివంటి "ఫ్యూడల్ " (Feudal) సంప్రదాయమునకు జెందిన నిరంకుశులగు సంస్థానాధీశులయొక్కయు జమీందారులయొక్కయు సహాయముతో సామ్రాజ్య ప్రభుత్వయొక్క గట్టిపట్టును శాశ్వతముగా