పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/652

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

162

భారతదేశమున


పనులు నాశనము చేయబడగా, యంత్రపరిశ్రమ లభివృద్ధిచేయబడకపోగా దేశప్రజలలో నూటికి 70 వంతులమంది జీవనార్ధము చేయునదిలేక వ్యవసాయమునే నమ్ముకొనవలసి వచ్చినది. అందరును భూములపై కెగబడుటవలన ఈ పోటీలో వ్యవసాయముచేయు రైతులకు లాభము లేక పోవుచున్నది. దేశములో రైతులయొక్క ఘోరదారిద్ర్యము ఋణగ్రస్తతయు, భూస్వామిత్వములోని విపరీతపు పద్ధతులును, సాక్షాత్తుగా భూమినిదున్ని కాయకష్టము చేయు కృషీవలురును చిన్న రైతులును, పెద్దజమీందారులయొక్కయు భూస్వాములయొక్కయు అప్పులిచ్చు షాహుకారులయొక్కయు చేతులలో పడియుండుటకు కారణములైనవి. దేశమునలక్షలకొలది జనులు శాశ్వత క్షుద్బాధతో బాధపడుచున్నారు. దేశములో మూడున్నరకోట్లకర్షకులకు భూములులేవు. అంతకన్న హెచ్చుమంది. షాహుకారుల చేతులలో శాశ్వత దాస్యము ననుభవించుచున్నారు. పట్టణవాసుల స్థితియు నింతకన్న బాగుగాలేదు. పట్టణములలోని బీదజనులు కేవలము నిరాధారులుగా నున్నారు. మన దేశములో కాయకష్టముచేయు కూలీజనమునకు వచ్చు కూలికన్న తక్కువకూలి, ప్రపంచములో నెక్కడనులేదు. మధ్యతరగతిజనులు నిర్వ్యాపారులుగా నున్నారు. వారికిగల జీవనాధారము సౌఖ్యము నానాటికి క్షీణించుచున్నవి. “ఎంత హెచ్చు అంచనా వేసిచూచినను కూడ 1929లో ఇండియాలో తల1కిసాలుకు సగటు అదాయము 8 పౌనులుకన్న తక్కువగానున్నది. ఇంగ్లాండు దీవులలో ఆసాలుననే సగటు ఆదాయము తల 1కి 95 పౌనులు. ఉభయ