బ్రిటీష్‌రాజ్యతంత్రము
159
పాలన జరుపును. ఇత డెప్పటివలెనే ఇంగ్లాండు పార్లిమెంటు ప్రభుత్వమువారి ఇండియా రాజ్యాంగకార్యదర్శి పెత్తనము క్రింద నుండి పార్లిమెంటుకు బాధ్యతవహించి మనదేశమును సర్వాధికారిగా పరిపాలించును. ఈ గవర్నరుజనరలుకు కొన్ని విషయములందు సలహానిచ్చుటకు సహాయము చేయుటకు ఒక మంత్రిసభ యుండును. కొన్నిషరతులకు లోబడి కొన్ని విషయములందు శాసననిర్మాణము చేయుటకు రెండు శాసనసభ లుండును. ఈ శాసనసభలలో సంస్థానాధీశులు గొప్పపలుకుబడి కలిగియుండి గవర్నరు జనరలుయొక్క నిరంకుశ పరిపాలనకే ఎల్లప్పుడు తోడ్పడుచుందురు.
నూతనరాజ్యాంగము భారతదేశముయొక్క ఆర్ధికపారతంత్రమును రాజకీయ దాస్యమును బానిసత్వమును చిరస్థాయిగా చేయుటకు ప్రయత్నించుచున్నది. దీనికి కారణము లేకపోలేదు.
"భారతదేశము బ్రిటీషుసామ్రాజ్యము యొక్క కొలికిపూస; ఏభాగము పోయినను మనసామ్రాజ్యమునిల్చును గాని భారతదేశము పోయినచో మన సామ్రాజ్య భానుడస్త మించవలసినదే" అని ఇండియా వైస్రాయిగానుండిన కర్జను ప్రభువు 1898 లో పలికినాడు. ఈ సంగతి బ్రిటిషు దీవుల పరిపాలనలో పలుకుబడిగల ప్రభువర్గము వారందరు నెఱుగుదురు.
బ్రిటీషుసామ్రాజ్యతత్వముయొక్క ప్రధానపురుషులలో నొకడగు బ్రెంటుఫర్డుప్రభువు కొన్నాళ్ల క్రిందట "మనము భారత