158
భారతదేశమున
కోట్ల రూపాయలు మనరైతులు చేసిన ఋణభారము కూడా కలదు. దీనిపైన వడ్డీలిచ్చుకోలేక క్రుంగిపోవుచున్నారు.
మన ప్రభుత్వాదాయవ్యయవిధానము ఈ దేశస్థితిగతుల కనుగుణముగా లేదు. అత్యధిక జీతములుగల ప్రభుత్వయంత్రము; ఆర్థికాభివృద్ధి కలిగింపని పరిపాలనావిధానము; కేవలము పన్నులు వసూలుచేసి సైన్యము ఉద్యోగులను పోషించుట మాత్రమేగాక జనసంఖ్యవృద్ధితోపాటు దేశప్రజల విద్య ఆరోగ్యము ఆర్థికక్షేమము అభివృద్ధిచేయుటయు అవసరముగాని అది యీ నిర్భాగ్య భారతదేశమున బ్రిటిషుసామ్రాజ్య ప్రభుత్వమున జరుగుట లేదు.
ఆరవ పరిచ్ఛేదము:
నూతనఇండియా రాజ్యాంగము
I
స్వరూప స్వభావములు
1935 సంవత్సరపు నూతన రాజ్యాంగ చట్టమువలన బర్మా విడదీయబడినది, 9 ప్రాతరాష్ట్రములుగాక సింధు ఒరిస్సాలనబడు రెండు క్రొత్తరాష్ట్రములు నిర్మింపబడినవి. ఈ బ్రిటీషు పరగణాలను 600 స్వదేశ సంస్థానములను కలిపి ఒక రాజ్యాంగసమాఖ్య (ఫెడరేషను)గా చేయుటకు క్రొత్త రాజ్యాంగచట్టము ప్రయత్నించుచున్నది. ఈ ఫెడరేషను యొక్క పరిపాలనాధికారము బ్రిటీషురాజు మకుటమునందే నెలకొల్పబడును. రాజుతానే భారతదేశ గవర్నరుజనరలు పరి