బ్రిటీష్‌రాజ్యతంత్రము
157
చాలా స్వల్పపుఆదాయము నొసగగల వ్యవసాయము పశువుల మేత మొదలగు పనులందు కష్టించు వ్యవసాయదారులు మనదేశ జనసంఖ్యలో నూటికి 67 మంది. ఇంగ్లాండులో నిట్టివారు నూటికి 7 మంది మాత్రమే. చాలా ఎక్కువ ఆదాయము నివ్వగల పరిశ్రమలు, వ్యాపారము, రవాణా మొదలగు లాభసాటి వృత్తులవారు మనదేశములో నూటికి 17 మంది. ఇంగ్లాండులో 68 నుంది. వ్యవసాయమువలననే మన దేశములో సంపాదించు ఫలితము తల 1 కి రూ 59 లు; - కెనడాలో నది తల 1 కి 213.
పరిశ్రమలవలన ప్రజలు సంపాదించు ఫలితము తల 1 కి 12 రూపాయీలు. అది అమెరికా సంయుక్త రాష్ట్రములలో 721 రూపాయిలు.
1932-33 లో మనదేశములో జరిగిన వ్యాపారము విలువ తల 1కి 8 రూపాయలకన్న తక్కువ. ఆ సాలుననే ఇంగ్లాండులో వ్యాపారము విలువ తల 1 కి రూ. 324. భారతదేశములో బ్యాంకులలో ఉన్న నిలువసొమ్ము తల 1 కి 604. అమెరికాలో రు. 1123. లు
ఇట్లు జాతీయ అర్ధసంపదలో భారతదేశము ఇతర దేశములతో పోల్ప వీలులేనంత అధోగతిలో నుండగా మనప్రజలు 1212 కోట్లరూపాయిలు ప్రభుత్వ ఋణభారము వహించవలసి యున్నారు. దీనిలో 500 కోట్లు పరాయివారి కివ్వవలెను. వీనిపైన వడ్డీ పెరుగుచున్నది. ఇది గాక వేయి