154
భారతదేశమున
లించినచో తెలియగలదు[1] సైన్యమునకు పెట్టు ఖర్చు, మొత్తము ఆదాయములో నూటికి 39.5 వంతులు. ఋణ తీర్మానము నిమిత్తము 15.2; విద్యకొరకు 7.6; వైద్యముకొరకు 2.28; ఆరోగ్యముకు 1.28; వ్యవసాయముకు 1.24 వంతులు చొప్పున ఖర్చు చేయబడు చున్నది.
నాగరకతాగ్రగణ్యులమని చెప్పుకొను నీ బ్రిటీషువారి వివిధరాష్ట్రీయ ప్రభుత్వములందున్న స్థితిగతులకన్న అనాగరకులును నిరంకుశులుననబడు భారతీయసంస్థానాధిపతుల రాజ్యములందే హెచ్చుమంది. అక్షరాస్యులును, ఎక్కువ సంఖ్య పాఠశాలలును కనబడుటయే ప్రభుత్వనివేదికలయందలి విపరీతపు వాదనలకు తగిన జవాబుగా కనబడుచున్నది. బ్రిటీషు ఇండియాలో జనసంఖ్య పెరిగినట్లే సంస్థానములలోను పెరిగినది. అయితే సంస్థానాధీశులు ప్రజలక్షేమముకొజుకు కొంచెముగనో గొప్పగనో హెచ్చుసొమ్ము ఖర్చుపెట్టిరి. మనప్రభుత్వము అట్లు చేయలేదు.
VI
భారతదేశ ఆర్థిక స్థితిగతులనుగూర్చియు బ్రిటీషు పరిపాలనములో నీదేశమున జరిగిన దనబడు "అభివృద్ధిని" గూర్చియు సర్ విశ్వేశ్వరయ్యగారు ఈ దిగువ సంగతులనుతమ “ప్లాన్‌డ్ ఎకానమీ ఫర్ ఇండియా" అనుపుస్తకములో బహిరంగ పరచి యున్నారు.
- ↑ అనుబంధములోని అంకెల పట్టికలు చూడుడు.