బ్రిటీష్‌రాజ్యతంత్రము
153
ఇంగ్లాండుదేశములో 57 సంవత్సరములును జపానులో 44నుసగటు ఆయుర్దాయమయి యుండగా మనదేశమున దామాషా ఆయుర్దాయము 23 మాత్రమె అయియున్నది. మన దేశములో వెయ్యిమందిలో 26 మందికి మరణములు తటస్థించుచుండగా ఇంగ్లండులో 12మంది, జపానులో 18మంది, మాత్రమెమరణించుచున్నారు. దీనికి జవాబుగా ప్రభుత్వనివేదికలందు మనజనసంఖ్య హెచ్చగుచున్నదనియు జనసంఖ్య యొత్తిడి చతురపు మైలునకు మన దేశమున అధికముగనున్న దనియు చెప్పజూతురు. కాని 1881లో ఇంగ్లాండులో చతురపు మైలుకు 446 మంది ప్రజలును వేయింటికి 35 జననములును ఉండగా వేయింటికి 21 మరణములుమాత్రము తటస్థించు చున్నట్లును మనదేశములో ఆనాటికి చతురపు మైలుకు 221 మంది జనులును వేయిమందికి 50 మంది జననములు నుండగా 44 మంది మరణములు నుండెనని, “40 సంవత్సరముల అభివృద్ధి'యను మదరాసు నివేదికలోనే వివరింపబడినది. నేడు ఇంగ్లాండుదేశములో జనసాంద్రత చతురపుమైలుకు 490, వేయింటికి 16 జననములు, 12 మరణములు, నుండగా మనదేశములో చతురపుమైలుకు 195 మంది జనులు వేయింటికి 32 జననములు 24 మరణములు కనబడుచున్నవి. ఇట్లు చూచినను వారివాదన ఎంత అసందర్భముగనున్నదో కనపడగలదు.
ఇంకొక చిత్రమేమన ప్రజల విద్య, ఆరోగ్యము, ఆర్థిక క్షేమలాభములకు వలసిన ఖర్చులు ఎంతో హీనముగనున్నవని ప్రభుత్వ ఆదాయవ్యయవిధానమును జాగ్రత్తగా పరిశీ