152
భారతదేశమున
నివేదికలందే ప్రకటింపబడియున్నది. నేడు నూటికి 8 మంది మాత్రమే అక్షరాస్యులు. ఇది మన విద్యావిధానము లోని యభివృద్ధి! దీనిని సమర్థించుకొనుటకు ఒక సర్ బిరుదాంకితుడు మనదేశజనసంఖ్య 1870 లో 20 కోట్ల నుండి ఇప్పుడు 35 కోట్లయినదని పత్యుత్తరము చెప్పుచున్నాడు. ఇది నాగరకతగల ప్రభుత్వము చెప్పవలసిన సమాధానమేనా!
1881-1891 | మధ్యజనసంఖ్యనూటికి | 9.6 చొప్పునవృద్ధియైనది. |
1891-1901 | మధ్యనూటికి | 1.4 చొప్పునవృద్ధియైనది. |
1901-1911 | మధ్యనూటికి | 6.4 చొప్పునవృద్ధియైనది. |
1911-1921 | మధ్యనూటికి | 1.2 చొప్పునవృద్ధియైనది. |
1921-1931 | మధ్యనూటికి | 10.6 చొప్పునవృద్ధియైనది |
ఇట్లీకాలమున నూటికి పదివంతులచొప్పున వృద్ధియగుట యొక హెచ్చులోనిది కాదని అర్థశాస్త్రజ్ఞుల యభిప్రాయము. ఆనాటికి మనకన్న వెనుకపడియున్న రష్యాదేశము, అమెరికా దేశములందు కూడ నేడు నూటికి 98 మంది విద్యావంతులుగ నున్నారు. ఇట్టి స్థితిలో మన దేశమునందు సాలుకు విద్యకొరకు చేయబడు 8 కోట్ల రూపాయిల వ్యయ మేమూలకు సరిపోవును! అత్యంతవిద్యావంతులుగ నున్న ఆదేశములలో నిప్పటికిని సాలుకు 40కోట్లు మొదలుకొని 80 కోట్లవరకు విద్యకు వ్యయము చేయుచున్నారు,
ఇక మనదేశప్రజల దామాషా ఆయుర్దాయము చూచినచో 1870 నాటికిని నేటికిని విశేషతారతమ్యముకనబడుట లేదు.