పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/641

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

151


వెచ్చించి మరమ్మతు చేయబడుచుండెను. బ్రిటీషుప్రభుత్వము స్థాపించబడినపిదప ఆనిర్మాణములన్నియు శికస్తులో పడిపోయి క్రొత్తవి నిర్మింపబడక వ్యవసాయాభివృద్ధిలేకపోగా రైతుల దారిద్ర్యము హెచ్చసాగినది. 1769 లగాయతు 1902 వరకును రమారమి 32 పెద్దకఱవులువచ్చి దేశములో అమితమైన జననష్టము కలిగినది. విశేషధనము సీమ కంపబడినందునను ప్రజాసౌకర్యములు చేయబడక పోయినందునను దేశముయొక్క సంపద క్షీణించిపోయి నిరంతరక్షామస్థితి యేర్పడినది. 1870 నాటికి సాలుకు తల 1 కి యిరువది రూపాయిలు మాత్రమే మనప్రజల దామాషాఆదాయము. నాడు విధింపబడినపన్ను తల1కి రు1-13-9 లు. నేటికి రు80-0-0 దామాషా ఆదాయము రు6-1-8లు పన్ను . నాడు 50 కోట్లుగానుండిన భారతదేశప్రభుత్వాదాయము నేటికి 226 కోట్లకు పెంచబడినది. నాడు 15 కోట్ల సైనికవ్యయము నేడు 55 కోట్లయినది. నాటి 12 కోట్ల సివిలు పరిపాలనా వ్యయము నేడు 45 కోట్లయినది. నాడు 100 కోట్లుగా నుండిన ప్రభుత్వఋణము నేటికి 1200 కోట్లకుపెంచబడినది. ప్రజలుతలకు మించిన ఋణభారమువలన పన్నులభారమువలన క్రుంగిపోవుచున్నారు. రైతులు దరిద్రులయి నారు. నాడుదేశములోని రైతులందరికిని కలిపి 200 కోట్ల ఋణముండగా నేడది వెయ్యికోట్లు దాటినది. ఇట్టిస్థితిలో ప్రభుత్వము ప్రజలకు చేసిన మేలేమి? 1870 నాటికి అక్షరాస్యులు అనగా చదువను వ్రాయను నేర్చినట్లు లెక్కలోనికి వచ్చినవారు నూటికి అయిదుమంది యుండిరని ప్రభుత్వ