Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/645

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

155

భారతదేశము వ్యవసాయ దేశమనియు అందువలన నీదేశప్రజలు వ్యవసాయమునే నమ్ముకొనవలెననియు బ్రిటీషు అర్థశాస్త్రజ్ఞులును వారిననుకరించువారును చెప్పుమాటలు సరికావు. వ్యవసాయమువలన నితరదేశములందువలె మనదేశ ప్రజలకు లాభము కలుగుట లేదు. సంపదను జాతీయాదాయమును వృద్ధిచేయగల పరిశ్రమలు వాణిజ్య రవాణావృత్తులు వృద్ధిచేయ బడకపోవుట ఘోర అన్యాయము. అందువలననే యీ దేశము దారిద్ర్యమున మునిగియున్నది.

1881 లో మన దేశమున వ్యవసాయ దారులు జనసంఖ్యలో నూటికి 61 మంది యుండగా ఇప్పుడు 73 గ్గురికి పెరుగుట వ్యవసాయములోని లాభమువలనగాక ఇతర జీవనాధారములు లేకపోవుటయె. ఈ రైతులు జీవనము గడువక ఋణములలో మునిగియున్నారు.

దేశముయొక్క ఔన్నత్యము జాతీయాదాయము పైన నాధారపడి యుండును. మనదేశ ప్రజలకు తల 1కి సాలు 1 కి రు 75-0-0 లు కన్న దామాషా ఆదాయములేదు. 1932-1933 లో ఇన్‌కంటాక్సు లెక్కలవల్ల బ్రిటీషు ఇండియాలోని జనసంఖ్య 27 కోట్ల 20 లక్షలలో 5,64,434 మంది మాత్రమే సాలు 1కి వేయి రూపాయిల పైబడిన ఆదాయము కలిగి పన్ను విధింపబడినట్లు తేలినది, వీనిలో 2,71,171 మంది రెండువేల రూపాయలకు తక్కువ ఆదాయముగలవారు. 2,93,263 మంది రెండు వేలు అంతకు పై బడిన ఆదాయములవారు. వీరిలో 358 మంది మాత్రమే లక్ష రూపాయలు ఆదా