Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/640

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

150

భారతదేశమున


'స్పెషల్'అలవెన్సులు లెక్క లేనన్ని గలవుమిలిటరిశాఖజీతములు అలవెన్సులుకలిసి 1913-14 నాటికి 1,34,554 వేల రూపాయిలు. 1922-23 నాటికి 2,69,972 వేలరూపాయిలకు పెరిగినది. సివిలుశాఖ జీతములు అలవెన్సులు కలిసి 1913-14 లో 67,512 వేలరూపాయిల నుండి 1922-23 నాటికి 1,37,522 వేలకు పెరిగినది. 1923లో లీ కమీషనువారు సివిలుశాఖోద్యోగులు అలవెన్సులను ఇంకొక కోటిరూపాయిలకు పెంచిరి.

V

భారతదేశమునందలి జాతీయనాయకులందరు మనదేశ దారిద్ర్యమునుగూర్చి వగచి దీనిని మాన్పుడని బ్రిటిష్‌ప్రభుత్వమును చిరకాలమునుండి కోరుచున్నను వారట్లుగావింపలేదు సరికదా తమ యుద్యోగులచేతను ఇంకను కొందరు ధనాపేక్షాపరులగు అర్ధశాస్త్రజ్ఞులచేతను తమపక్షమున ప్రచారముచేయించి తమ ఆర్థికవిధానమును వ్యయపద్ధతులను సమర్థించుకొనజూచుచున్నారు. ఈప్రచారములో వీరనేక విపరీత హేతువాదములు చేయుచుందురు. బ్రిటీషుప్రభుత్వమునకు పూర్వము మొగలాయి చక్రవర్తులకాలమున బ్రిటీషుసామ్రాజ్యముకన్న తక్కువవైశాల్యముగల రాజ్యభాగములనుండియే ఆచక్రవర్తులు ఇంతకంటటె హెచ్చు భూమిశిస్తును వసూలు చేయుచుండిరనియు బ్రిటీషువారు వసూలుచేయుచున్న భూమిశిస్తు అత్యధికముగాదనియు వీ రనుచుందురు; కాని మొగలాయిచక్రవర్తుల కాలమున పల్లపుసాగు నీటివనరుల కవసరమైన కాలువలు తటాకములు నూతులు ఎన్నో నిర్మింపబడి ఎప్పటికప్పుడు ఎంతోసొమ్ము