Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

భారత దేశమున


భూముల నిచ్చినారు. ఈ చరిత్రభాగ మెవరో వ్రాసినది కాదు; ఆ అన్యాయములు చేసినవారు రచియించినదే! ఈ అయోధ్య రాష్ట్ర దుష్పరిపాలనకు ప్రజల దారిద్ర్యమునకు ప్రజాపీడనకు కారణము నేటి పరిపాలకులా ? వారిపైన స్వారి చేయుచుండిన ఆంగ్లప్రభువులా? (Reform Pamphlet No. 9)

VI

మహారాష్ట్ర రాజ్యము

మహారాష్ట్రుల పరిపాలనను గూర్చి ఆంగ్లచరిత్రకారు లనేకములగు అబద్దపుకథలను గల్పించి ఆవీరజాతికి నాయకుడగుశివాజీని దోపిడిదొంగయని నిందించినారు. కాని ఆమహానుభావుని గొప్పదనమును భారతీయులెల్లరు నిటీవల గహించి అతనిని పూజించుచున్నారు.

ఔరంగజేబు రాజ్యకాలమున మొగలుసామ్రాజ్యము యొక్క పునాదుల నీ మహావీరుడు శివాజీ కదల్చివైచినాడు. అతనికి కేవలము రణకౌశలముమాత్రమే గాక మంచి ప్రభు మంత్రోత్సాహశక్తులు, పరిపాలనా దక్షతయు గలవు. తన పరిపాలనలో ప్రజల సంరక్షణకొర కత డనేక శాసననియమములు చేసి వానిని తన రాష్ట్రీయగ్రామాధికారులు సక్రమముగా పాటించునట్లు చేసెను. యుద్దమువలని అనర్ధకములనుండి ప్రజలను కాపాడుటకొర కతడు చేసిన కట్టుబాటుల ప్రాశస్త్యమునుగూర్చి అతని శత్రువులుకూడ పొగడియున్నారు. ఈ “దోపిడిదొంగ" యొక్క సద్గుణములు అప్రతిమానములు. దేశ