బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
39
పిండిరి. (Mill's History of India) కంపెనీయొక్క సివిలు మిలిటరీ యుద్యోగుల జీతములు, పింఛనులు, నవాబు ఆదాయము మ్రింగివై'చెను. అతని అధికారముకూడా క్రమక్రమముగా క్షీణించి ఆంగ్లేయుల హస్తగతమయ్యెను. అతని అధికారము గౌరవము సంపదయునశించినవి. వార౯ హేస్టింగ్సు ఆనాటి స్థితిని వర్ణించియున్నాడు. “దీనివలన దేశములోని ప్రజలకు ఆంగ్లేయ పద్దతులపైన తీవ్రమైన అసహ్యభావము కలిగెను. నవాబు వజీరు సేవకుల హక్కులకు బాధ్యతలకు భంగకరముగా తెల్లవారు ప్రవర్తించుచుండిరి. కేవలము తెల్లవారి లాభముకొరకు నవాబుపైన పన్ను విధించుట అతడు భరింపలేని అతని కక్కరలేని సైనిక వ్యయభారము నతనిపైన వేయుట ఎంత అన్యాయము ! అయోధ్యలోని ప్రతి ఆంగ్లేయునకు సర్వాధికారము లుండెను. లక్షలకొలది ఆదాయమును వారు హక్కుగా గోరుట ప్రారంభించిరి. ఒక్క యాటలో రెండు లక్షల నొడ్డుట వారికొక లెక్కగా లేదు." అని వార౯ హేస్టింగ్సు వగచినాడు. కార౯ వాలిస్ కాలములో ఆంగ్లేయు లీ అయోధ్యవలన పుచ్చుకొను డిమాండు సాలుకు 250000 పౌనులనుండి 700000 పౌనులకు పెరిగినది. తరువాత నది యింకను పెంచబడినది. 1801లో రాజ్యమునంతయు లాగికొందునని బెదిరించి వెలస్లీ సాలుకు 1300000 పౌను లాదాయము వచ్చు అర్ధ భాగమును లాగుకొన్నాడు. 1815 మొదలు 1825 వరకు అప్పులను పేరున 40 లక్షల పౌనులు బలవంతముగా తీసికొని నవాబుకు రాజని బిరుదునిచ్చి ఎందుకు పనికిరాని