Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

41


ముయొక్క సత్పరిపాలన కొర కత డేర్పరచిన బందోబస్తులు అతడు గతించిన ఎనుబదివత్సరములవరకు గూడ చక్కగా పనిచేసియుండుటయే అతని గొప్పదనమునకు సాక్షి . 'ఆంక్విటిల్ డు పెర్రాన్' అనునతడు ఆనాడు భారత దేశమును దర్శించి ప్రకటించిన వ్యాసములో మహారాష్ట్ర రాజ్యమును గూర్చి చక్కగా వర్ణించియున్నాడు:

(Brief account of a voyage to India. Anquetil du Perron published in Gentleman's Magazine 1762).

"సూరతునుండి నేను పశ్చిమ కనుమలు దాటితిని. పగలు పదిగంటలవేళ నేను మహారాష్ట్ర దేశముజొచ్చితిని. సత్యయుగమునాటి నిరాడంబరత్వము ఆనందము నాకన్నులకు గోచరించినవి. ప్రకృతి యిచ్చట కృత్రిమపు మార్పులజెంద లేదు. యుద్ధము దుఃఖము నిచ్చటి ప్రజలెరుగరు. ప్రజలెల్లరు సంతోషముగ మంచిబలశాలురుగ ఆరోగ్యవంతులుగా నుండిరి. అతిథిపూజ, అభ్యాగతి కాతిథ్యము నచ్చట సర్వసామాన్యమగు మర్యాద. బంధుమిత్రులకు ఇరుగు పొరుగువారికే గాక కేవలము పరాయివారినిగూడ ఆ రాజ్యములోని గృహస్థులు సత్కరింతురు."

శివాజీ తరువాత రాజ్యమేలినవారుకూడ చాల సమర్థులగురాజనీతిజ్ఞులు. బాజీరావుబులాల్‌కు మహారాష్ట్రులధైర్య సాహసములు. ధృడకాయము మాత్రమేగాక కొంకణ బ్రాహ్మణుల విద్యాజ్ఞానము, మర్యాదయు నుండెను. అతడు మహావక్త,కుశాగ్రబుద్ధి, గంభీరుడు, నిరాడంబరుడు, మంచినీతి