146
భారతదేశమున
ఈవ్యవసాయము ఫలప్రదముగా లేదు. ఈపరిశ్రమ లధోగతిలో నున్నవి. నేడు మనప్రజలలో ధనికులతో పాటు బీదలపైన కేంద్రరాష్ట్రీయ స్థానిక ప్రభుత్వములన్నియు విధించు అన్ని బాపతులపన్నులభారము తల 1 కి సాలుకు రు 10-0-0 లుగనున్నదని అంచనా వేయబడినది. భారదేశముయొక్క ఆర్థికస్థితిగతులు జనులవిద్య ప్రభుత్వముయొక్క ఆదాయవ్యయములపద్ధతి ఋణము మొదలగువాని నితరదేశములవానితో పోల్చి చూచినచో మన ప్రజల దారిద్ర్యమును దేశముయొక్క దుస్థితియు ప్రతిమనుష్యునకును వెల్లడియగును.
IV
సైనికశాఖ బ్రిటిష్ రాజ్యతంత్రముయొక్క పునాది. ఐరోపాసంగ్రామము నాటివరకు 'భారతదేశ' సైన్యములో స్వల్పజీతములుగల భారతీయ సైనికులేగాని భారతీయ ఉద్యోగులు (ఆఫీసర్లు) లేరు! తరువాత భారతీయాందోళన ఫలితముగా కొందరి కుద్యోగము లిచ్చెదమని ప్రభుత్వము వారనిరి గాని నేటివరకు జరిగిన 'అభివృద్ధి' హాస్యాస్పదముగా నున్నది. 1929 వరకు కెప్టెనులకన్న హెచ్చుహోదా ఉద్యోగులులేరు. ఆసంవత్సరములో కెప్టెనుల సంఖ్య 39. 1936 లో, సైన్యములో భారతీయ ఉద్యోగులు 233. నౌకాదళములో 9 మంది. విమానదళములో 9 మంది. మొత్తము 251 మంది