పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/637

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

147


మాత్రమే భారతీయులు! మన భారతీయ ఆఫీసర్లకన్న బ్రిటీషు ఆఫీసర్లకు 6-7 రెట్లు అధికవ్యయము. సైనికదళముల మొత్తముసంఖ్య సాలులో దామాషాగా 204000 లో స్వల్పజీతముల భారతీయులు మూడింట రెండువంతులుగా నున్నారు. మిగతా మూడవవంతువారు వీరికన్న మూడునాలుగురెట్లు అధికవ్యయమునకు కారణమైన బ్రిటీషు సోల్జరులు.[1]

సైన్యము, సివిలు పరిపాలన శాఖలలో ఆంగ్లేయోద్యోగులు, భారతీయులు

సంవత్సరములు బ్రిటీషు సైనికులు "నేటివులు" భారతీయులు మొత్తం రూ. దామాషాఖర్చు కోట్లరూ.
1837-38 మొదలు 1856-57 వరకు 20 సం. 43,826 2,22,915 2,66,741 10.85
1861-62 మొ. 1873-74 వరకు 13 సం. లు 62,458 1,23,881 1,86,340 15.68
1874-75 మొ. 1880-81 వరకు 7 సం. లు 61,884 1,22,556 1,84,441 16.17
1881-82 మొ. 1884-85 వరకు 4 సం. లు 57,975 1,19,939 1,77,714 16.55
1885-86 మొ. 1894-95 వరకు 10 సం. లు 70,704 1,40,682 2,11,387 18.25
1894-95 74,040 1,45,738 2,19,778 20.1
1931 59,773 1,68,660 2,28,433 55
  1. వీరి జీతములు అలవెన్సులకు అనుబంధము చూడుడు.