Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/632

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

142

భారతదేశమున


III

1909-1921 మధ్య జరిగిన 'అభివృద్ధి' చరిత్రయు నిట్లే యున్నది. సాలు 1కి తల 1 కి ప్రజలదామాషా ఆదాయము 50 రూపాయిల నుండి 67 రూపాయలకు మాత్రము పెరిగినది. రాష్ట్రీయాదాయవ్యయములు మాత్రము రెట్టింపునకు పెరిగినవి. పన్నుల భారము 1901 లో తల 1కి సాలుకు రు 2-6-6 లు నుండి 1921 లో రూ 6-1-8 కు పెరిగినది. 1920 నాటికి అక్ష రాస్యులసంఖ్య నూటికి 7.7 మాత్రమే. వేయిజన సంఖ్యలో మరణముల సంఖ్య 30.59 గ నుండెను. సైనిక వ్యయము 68 కోట్ల రూపాయలకు, సీమచార్జీలు 45.5 కోట్ల రూపాయిలకు, సివిలుపరిపాలన 56.8కోట్ల రూపాయిలకు పెరిగినది. మొత్తము ప్రభుత్వ వ్యయము 1910-11 లో 115.12 కోట్ల రూపాయలనుండి 1921 లో 222.02 కోట్ల రూపాయిలకు పెరిగినది.

ఇక 1920 లో మాంబేగ్యూ సంస్కరణములు వచ్చిన తరువాత జరిగిన 'అభివృద్ధి' కథ యేమి?

ఈ సంస్కరణలవలన రాష్ట్రీయ మంత్రుల వశమైన శాఖల కొరకు ఖర్చుచేయుటకు ఒసగబడిన సొమ్ము అతి స్వల్పము. ఈ మంత్రులు కేవలము బ్రిటిషు ప్రభుత్వము యొక్కబొమ్మల కొలువులోని కీలుబొమ్మలే గాని ప్రజల కెట్టి మేలు చేయలేకుండిరి.