ఈ పుట ఆమోదించబడ్డది
బ్రిటీష్‌రాజ్యతంత్రము
143
వివిధ రాష్ట్రీయ ప్రభుత్వము మంత్రుల వశమైన శాఖల ఖర్చు లిట్లుండెను.[1]
రాష్ట్రము | 1921-22 లక్షల రూ. | 1923-24 లక్షల రూ. | 1929-30 లక్షల రూ. |
మదరాసు | 428 | 418 | 763.8 |
బొంబాయి | 561 | 478 | 567.6 |
వంగరాష్ట్రము | 352 | 321 | 404.0 |
సంయుక్తరాష్ట్రము | 352 | 314 | 388.2 |
పంజాబు | 307 | 282 | 542.7 |
సైనిక వ్యయము సివిలు పరిపాలన సీమఖర్చులు పెరుగుచునేయున్నవి. విద్యకు వైద్యమునకు సొమ్ములేదు. గ్రుడ్డిలో మెల్లయనునట్లు ప్రాథమిక విద్యకొరకు చేయబడు ప్రభుత్వ వ్యయ విధానములో కొంతమార్పు కలిగినది. ఈ దేశములో నింతవరకు ప్రాథమిక విద్యకొరకు చేయబడిన మొత్తము వ్యయ మిట్లుండెను.[2]
1897 లో | 1.10 కోట్లరూపాయిలు | |
1902 లో | 1.18 కోట్లరూపాయిలు | |
1907 లో | 1.55 కోట్లరూపాయిలు | |
1912 లో | 2.07 కోట్లరూపాయిలు | |
1917 లో | 2.93 కోట్లరూపాయిలు | |
1922 లో | 5.09 కోట్లరూపాయిలు | |
1927 లో | 6.95 కోట్లరూపాయిలు |