ఈ పుట ఆమోదించబడ్డది
136
భారతదేశమున
భూమిపన్ను రాష్ట్రము | సాలు 1కి చతురపుమైలు పౌ. షి. పె | సాలు 1కి తల 1కి పౌ. షి. పె |
వంగరాష్ట్రము, అస్సాము | 17 - 14 - 3 | 0 - 1 - 1 1/2 |
బొంబాయి, సింధురాష్ట్రములు | 22 - 0 - 11 | 0 - 3 - 4 1/2 |
మద్రాసు రాష్ట్రము | 29 - 0 - 9 | 0 - 2 - 6 3/4 |
పశ్చిమోత్తర (ఆగ్రా) పరగణా | 45 - 4 - 9 | 0 - 2 - 4 3/4 |
పంజాబు రాష్ట్రము | 17 - 6 - 4 | 0 - 2 - 0 |
ix 1858 లో ఈదేశమునుండి ఎగుమతియైన సరకులవిలువ 255 లక్షల పౌనులు; దిగుమతుల విలువ 145 లక్షల పౌనులు. 1907-08 లో 1155 లక్షల ఎగుమతులు; 865 లక్షల దిగుమతులు, దిగుమతులకన్న మనము ఎక్కువగాచేసిన ఎగుమతులన్నియు ముడిపదార్ధములలో పంపుచున్నాము. ఈ తేడావిలువ మనకు నష్టము, వారికి లాభము.
సుంకముల విధానము ఇంగ్లాండు కనుకూలముగా చేయబడినను కొంచెము పెరిగినది. ఆదాయపుపన్ను స్టాంపులు అడవులు పోస్టుతపాలా తక్కిన ఆదాయములుకూడ చాలా రెట్లు పెరిగినవి.
x ఇక వ్యయములలో సైనిక వ్యయము అత్యధికముగా పెరిగినది. 1861-1874 మధ్య దామాషాగా సాలు 1కి 16 కోట్ల రూపాయలనుండి 1899-1913 నాటికి 27 కోట్ల 40 లక్షలకు పెరిగినది.
సివిలు పరిపాలనవ్యయము 1861-1874 మధ్య సాలు1కి