Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/627

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

137


దామాషా 10.28 కోట్లరూపాయల నుండి 1899-1913 నాటికి సాలు 1 కి దామాషాగా 24 కోట్ల రూపాయిలయినది.

ఉద్యోగుల జీతములు పింఛనులు మూడురెట్లకు పెరిగిపోయినవి (అనుబంధమునందలి అంకెల పట్టికలు చూడుడు. )

1861-74 మధ్య సాలు 1 కి దామాషా సీమఖర్చులు 10.47 కోట్లనుండి 28.35 కోట్ల రూపాయలకు పెరిగినది.

ప్రభుత్వఋణము 1871 లో 155 కోట్ల రూపాయలనుండి 1911 నాటికి 350 కోట్లకు పెరిగినది.

విద్యావిషయము చూచినచో 1854 కు పూర్వము మద్రాసులో నొకే ఇంగ్లీషుపాఠశాల! దేశములో 1870 నాటికి నూటికి 5 మంది మాత్రమే చదువను వ్రాయనువచ్చినట్లు లెక్కింపబడిన అక్షరాస్యులుగానుండగా 1909 నాటికి నూటికి 5.3 మంది యుండిరి. ఇక ప్రభుత్వము చేయు వ్యయము వివిధ దేశములతో పోల్చినచో 1908 నాటి కిట్లుండెనని గోఖలేగారు చెప్పినారు:-

దేశము తల 1కి దేశాదాయము తల 1కి విద్యకొరకువ్యయము షిల్లింగులు పెన్నీలు
ఫ్రాన్సు 25.7 5-4
జర్మనీ 18.7 4-0
ఇటలీ 12. 1-8
ఆస్ట్రియా 16.3 2-4
నెదర్లాండ్సు 26.0 4-3
భారతదేశము 2 0-1 1/2 పెన్నీలు