ఈ పుట ఆమోదించబడ్డది
బ్రిటీష్‌రాజ్యతంత్రము
135
సం. మొదలు | వరకు | దామాషాగా నష్టము |
1876-77 | 1880-81 | రూ 120 లక్షలు |
1881-82 | 1885-86 | రూ. 74 లక్షలు |
1886-87 | 1890-91 | రూ. 162 లక్షలు |
1891-92 | 1895-96 | రూ. 153 లక్షలు |
1896-97 | 1898-99 | రూ. 168 లక్షలు |
1899-1900 | 1904-05 | రూ. 111 లక్షలు |
viii ఈ కాలములోనే పల్లంసాగు నీటి పారుదలకు కాలువలు త్రవ్వుటకు వీనిమరమ్మతుకు చెరువుల మరమ్మతుకు 45 కోట్ల రూపాయిలు ఖర్చు చేయబడెను.
రోడ్లు బిల్డింగులకు 1896-97 - 1901 మధ్య 4 కోట్లు 1901-04 మధ్య 5 కోట్ల రూపాయిలు ఖర్చు చేయబడెను.
1858 నాటికి పల్లంసాగు 1500000 యకరములు
1906-07 ........... 222 25000 యకరములు
దీనిపైనవచ్చు ఆదాయమువలన ఆ నిర్మాణముల ఖర్చు మళ్లినది. దీనివలన పండుపంటలో సాలుకు 60 కోట్ల రూపాయిల విలువగలపంట ప్రభుత్వమునకు చేరుచున్నది.
1871 లోని లెక్కలనుబట్టి ఇండియా రాజ్యాంగసహాయ కార్యదర్శి సర్ లూయీమాలెట్ గారు 1875 లో తయారుచేసిన లెక్కలవలన చతురపుమైలుకు చూచినను తల 1కి మనిషి పైనచూచినను భూమిశిస్తు అతిభారముగ నుండినట్లు తేలుచున్నది. నికరపంటలో నూటికి 50-60 వంతులుండెను.