పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/620

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

130

భారతదేశమున


లేదు. ఇక 1919 లో చేయబడిన సంస్కరణములవలన శాసనసభలందు ప్రజాప్రతినిధుల సంఖ్యయు శాసన నిర్మాణాధికారమును హెచ్చు చేయబడినను కోశాధికారము ఒసగబడలేదు. గవర్నరుజనరలు సర్వాధికారియై సర్టిఫికేషను అధికారము ప్రయోగించుచుండెను. ఇట్లు 1919 వరకుగూడ ప్రజాప్రతినిధులకు నిజమైన శాసన నిర్మాణాధికారములు కలుగలేదు.[1]

ఐదవ పరిచ్చేదము :

బ్రిటీషు రాజ్యతంత్రమున భారతదేశ 'అభివృద్ధి'

I

భారతదేశమునకు ప్రకృతిసంపద పుష్కలముగానున్నను ఆర్థికముగ మనప్రజ లధోగతిలో నున్నారనియు దారిద్ర్యమున మునిగియున్నారనియు దీనిని మాన్పుటకు వలసిన ప్రయత్నములెల్ల చేయవలెననియు భారతజాతీయ నాయకులెల్లరును కోరుచుండగా, భారతదేశక్షేమలాభముల నాలోచించియే తామీదేశమును పరిపాలించుచున్నామనియు దేశము క్రమక్రమముగా నభివృద్ధిగాంచుచునే యున్నదనియు బ్రిటీషుసామ్రాజ్య తత్వవాదులు ప్రత్యుత్తరమిచ్చుచుందురు. తమ పరిపాలనా పద్ధతిని ఆదాయవ్యయపద్ధతిని సమర్థించుకొనుటకు కొందరుద్యోగులచేత కొన్ని నివేదికలను స్థితిగతిలెక్కలను తయారుచేయించి తమ ప్రభుత్వమునం దీభారతదేశము దినదినాభివృద్ధి


.

  1. 1909,1919 సంవత్సరముల సంస్కరణములకు అనుబంధము చూడుడు