Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/621

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

131


గాంచుచున్నదని గొప్పప్రచారము చేయుచున్నారు. 1858 మొదలు నేటివర కిట్టి నివేదికలు స్థితిగతిలెక్కలు అనేకములు తయారుచేయబడినవి. పూర్వపరిపాలనకన్న బిటిష్‌పరిపాలన బాగున్నదని ప్రజ లభివృద్ధిగాంచుచున్నారని బ్రిటిష్ ప్రభుత్వాదాయ వ్యయపద్ధతులు, పన్నులవిధానము న్యాయమైనవే యనిచూపుటయే వీరియుద్దేశము. అందుకనుగుణముగా ప్రాత పరిస్థితులలోను, ఇతరదేశపరిస్థితులలోను, తమకనుకూలమైన అంకెలనుమాత్రమే వీరుగ్రహింతురు. వీరి లెక్కలలోని అంతరార్ధము అనుభవజ్ఞులగు అర్థశాస్త్రజ్ఞులు తప్ప ఇతరులు కనిపెట్టజాలనన్ని తికమకలు కల్పింపబడును. -

ఈ కాలములో దేశమభివృద్ధి గాంచుచున్నదని తెలుపుటకును తమ పరిపాలనా పద్దతిని సమర్ధించుటకును ఇండియా గవర్నమెంటు రాష్ట్రీయ ప్రభుత్వములుగూడా వార్షిక లెక్కలనేగాక అప్పుడప్పుడు 'అభివృద్ధి' నివేదికలను స్థితిగతి లెక్కలను పార్లమెంటుకు సమర్పించుచుండిరి. కంపెనీపరిపాలనము రద్దుచేసిన పిదప 1858 మొదలు బ్రిటీషు సామ్రాజ్య పార్లమెంటు ప్రభుత్వముక్రింద అత్యంతాభివృద్ధి గాంచినట్లు లోకమునకు ప్రకటించుటకు ఇట్టి నివేదిక స్థితిగతులను తెలివి తేటలతో తయారుచేసిన ఉద్యోగులలో కొందరికి దివానుబహద్దరు, సి. ఐ. ఇ., సర్ బిరుదములుకూడ ఒసగబడియున్నవి. ఇది కూడ బ్రిటీషురాజ్యతంత్రములో నొకభాగము.

1865 మొదలు భారతదేశ జనసంఖ్యనుగూర్చియు చారిత్రక, ఆర్థిక, స్థితిగతులను గూర్చియు సమాచారములను