Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/619

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

129


ప్రశ్నలువేసి ప్రభుత్వ వ్యవహారములు బహిరంగపరచుట. కవకాశము గలిగింపబడెను. నిజమైన శాసననిర్మాణాధికారము లేకపోయినను ప్రజాప్రతినిధులు దాని కెన్నుకొనబడక పోయినను భారతీయ ప్రతినిధు లనువారైనను, ఆశాసన సభయందుండుటకు మాత్రము అవకాశము కలిగెను. ఇట్లే రాష్ట్రీయ శాసనసభలుకూడా పెద్దవిచేయబడెను. బొంబాయి మద్రాసులలో అదనపుసభ్యుల సంఖ్య ఎనిమిదిమందికి పైగా ఇరువది మందివరకు పెంపు చేయవచ్చును. వంగరాష్ట్రమున 20 మందికిని, పశ్చిమోత్తర (నేటి ఆగ్రా అయోధ్య) పరగణాలలో 15 మందికిని పెంచవచ్చును. ఈ సభలకు సభ్యులను పేర్కొను అధికారము వర్తకసంఘములకు, విశ్వవిద్యాలయములకు, సెనేటు సభలకు , ఇంకను జిల్లాబోర్డులకు, మునిసిపలు సంఘములకు, పెద్ద జమీందారులకును ఇవ్వబడెను. మఱియు రాజధాని నగరములనుండి కూడ ఒక్కొక సభ్యుని నియమించుట కేర్పాటు చేయబడెను. ఇట్లు ప్రజానాయకులను శాసనసభలకు ప్రతినిధులుగా నియమించు పద్దతివచ్చినను సరియైన ప్రాతినిధ్యపద్ధతులు స్థాపింపబడలేదు.

1909 లో మింటోమార్లే సంస్కరణలవలన శాసనసభ లింకను పెద్దవిచేసి , అందలి ఉద్యోగేతరులసంఖ్య హెచ్చుచేసి, కొంత సంకుచితములైన ప్రజాప్రాతినిధ్య పద్దతులు స్థాపింపబడినను ఇంతవరకు నీసభలు కేవలము ప్రభుత్వమును విమర్శించుటకు చర్చించుటకు వీలుగల డిబేటింగు సొసైటీలుగానే యుండెనుగాని అధికారము లావంతయు వీని కివ్వబడ