పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/618

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

128

భారతదేశమున


యైన నుద్యోగేతరులను) నియమించి వేరుగా నింకొక ప్రత్యేకసభలో శాసనములు చేయునట్లు ఏర్పాటుచేసిరి. ఈ రాష్ట్రముల శాసనము , రాష్ట్రములకే వర్తించునట్లు శాసింపబడెను. భూముల సుంకము, ఇతరపన్నులకు సంబంధించిన శాసనములకు, కరెన్సీ, తపాల తంతి, పీనలు కోడ్డు, మతము, మిలిటరీ, పేటెంటు, కాపీరైటు, సంస్థానములనుగూర్చిన శాసనములకు వైస్రాయి అనుమతి ముందుగా గైకొనవలెను. ఈ రాష్ట్రీయసభలు కేంద్రశాసనములకు, పార్లమెంటు శాసనములకు విరుద్ధములగు శాసనములు చేయరాదు. ఇట్లు 1861 లో చేయబడిన సంస్కరణముల వలనగూడ మనకెట్టి ప్రజాపాతినిధ్య పద్దతులులేవు, సరికదా శాసనసభలకు నిజమైన శాసననిర్మాణాధికారముగూడా కలుగలేదు. కేవలము సలహాసంఘముగనే యుండెను. తరువాత నిట్లేవంగరాష్ట్రమునను సంయుక్త రాష్ట్రములలోను శాసనసభలు నిర్మింపబడెను.

1892 లో నింకొక చట్టమువలన నీసుప్రీము శాసనసభలోని అదనపు సభ్యలసంఖ్య 10 మందికి తక్కువకాకుండా 16 మందికి మించకుండా పెంపుచేయుటకు వీలు కలిగింపబడెను. మఱియు నీసభ్యుల నియామకమును గూర్చి నిబంధనలు చేయుటకు గవర్నరు జనరలు కధికార మొసగబడెను. ఈసభ్యులలో 5 మందిని బొంబాయి మద్రాసు వంగరాష్ట్ర శాసనసభలలోని ఉద్యోగేతర సభ్యులే ఎన్నుకొనునట్లు తరువాత ఏర్పాటు జరిగినది. గవర్నరు జనరలు శాసనసభవారికి (బడ్జెటు) ఆదాయవ్యయపట్టికను చర్చించుట కవకాశమొసగబడెను.