బ్రిటీష్‌రాజ్యతంత్రము
127
గూర్చి కూడా విమర్శింపసాగెను. 1853 లోని చట్టమువలన మద్రాసు బొంబాయి గవర్నరు కార్యాలోచనసభల ప్రత్యేక శాసనాధికారము తీసివేయబడెను. -
'సిపాయిల' విప్లవానంతరము 1861 లో శాసననిర్మాణమునందు భారతీయులను తర్బీదుచేయు సదుద్దేశ్యముతో మూడు క్రొత్తశాసనసభలు నిర్మించుచున్నామని చెప్పి ఒక చట్టము చేసిరి. గవర్నరు జనరలు శాసనసభ (సుప్రీం లెజిస్లే టివు కవున్సిలు) లో 6 మొదలు 12 మందివరకు అదనపు సభ్యులను నియమించు అధికారము వైస్రాయి కివ్వబడెను. ఆసంఖ్యలో సగముమందియైన నుద్యోగేతరులైయుండవలెననిరి. వారు ఆంగ్లేయులు కావచ్చును, భారతీయులు కావచ్చును. ఆయన కిష్టమైనవారిని నియమించి బహూకరించుచుండెను. అందువలన నీ సభ్యత్వము ఆశ్రయింపుమీద నే ఆధారపడియుండెను. ఈ సభలైనను. కేవలము సలహానిచ్చుట కేర్పడిన కమిటీలేగాని స్వతంత్రముగా శాసన నిర్మాణము చేయునవిగావు. నిజమున కానాడు చేయబడు శాసన నిర్మాణమనునది ప్రభుత్వమువారుచేయు ఒకవిధమగు ఉత్తరువులే యనిచెప్పవచ్చును.
1858లో మద్రాసుబొంబాయి రాష్ట్రములకు తీసివేయబడిన శాసననిర్మాణాధికారము 1861 లో మఱలనివ్వబడెను. ఈరెండు రాష్ట్రముల గవర్నరులు శాసననిర్మాణమునుగూర్చి ఆలోచించునప్పుడు తమకార్యాలోచన సభలలో ఆరాష్ట్రములోని అడ్వకేటు జనరలును ఇంకను నలుగురు మొదలు ఎనిమిది మంది వరకు అదనపు సభ్యులను (దీనిలో గూడ సగము మంది .