పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/616

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

భారతదేశమున


ప్రభుత్వమునకు స్వతంత్రశాసన నిర్మాణాధికారము లేదు. పూర్వము “రిగ్యులేషను” లనబడునవి చేయబడుచుండెను.. అంతట భారతదేశములోని శాసనాధికారములు కార్యనిర్వాహకసభాయుతుడగు గవర్నరు జనరల్ వల్లనే చలాయింపబడునట్లు 1833 లో తూర్పు ఇండియా కంపెనీవారికి రాజ్యాధికార సన్నదు లిచ్చుచూ పార్లమెంటువారు చేసిన రాజ్యాంగచట్టమువలన శాసింపబడెను. తరువాత 1853 లో మరల కంపెనీవారికి రాజ్యాధికార సన్నదు నిచ్చునప్పుడు చేసిన రాజ్యాంగ చట్టమువలన శాసన నిర్మాణమున సలహానిచ్చు వ్యవహారమును కార్యాలోచన సభనుండి వేరుపరచి క్రొత్తగా నిర్మింపబడిన యింకొకసభకిచ్చిరి. ఈసభలో గవర్నరుజనరలు, సర్వసేనానియు, కార్యాలోచన సభలోని నలుగురు సభ్యులతోపాటు మద్రాసు, బొంబాయి, వంగరాష్ట్ర రాజధానుల నుండియు, తక్కిన లెఫ్టినెంటు గవర్నరుల పరగణాలనుండియు పంపబడు అనుభవజ్ఞులగు ఉద్యోగులును, కలకత్తా ప్రధాన న్యాయమూర్తియు, ఇంకొక సుప్రీమ్ కోర్టుజడ్జియు కలిసి పరివేష్టింతురు. ఈ శాసన నిర్మాణసభ నిర్మింపబడినప్పుడు దేశములో హిందూమహమ్మదీయ పెద్దమనుష్యులనుకూడ చేర్చుడని కొందరు ఆంగ్ల రాజనీతిజ్ఞులును కొందరు విద్యాధికులగు భారతీయులును కోరిననూ పార్లమెంటువారంగీకరింప లేదు. ఈ క్రొత్తశాసనసభ బహిరంగముగా సమావేశమగుచుండినందున ప్రజలుకూడా వచ్చి ఇందలి చర్చలు వినుచుండిరి. ఈ క్రొత్తశాసనసభ కార్యనిర్వాహక వర్గము వారిచర్యలను