పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/615

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

125


జీతములక్రింద భారతదేశకేంద్రరాష్ట్రీయ ప్రభుత్వములవారు సాలుకు 57 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టుచున్నారనియు, దీనిలో ఇండియాప్రభుత్వము 16కోట్లు జీతములక్రింద వ్యయము చేయుచున్నదనియు, దీనిలో బ్రిటిష్ ఇండియను ఆఫీసర్ల జీతములు అలవెన్సులు కలిపి 16 కోట్ల రూపాయలనియు ఈ మొత్తములో 6 కోట్ల రూపాయలు కేవలము బిటిష్ (ఆంగ్లేయ) ఆఫీసర్లకు చెల్లించబడుచున్నదనియు చెప్పినారు. మిలిటరీ రైళ్ళ శాఖలతో కలిపి సాలియానా జీతముల క్రింద 120 కోట్లు ఖర్చు చేయబడుచున్నది. పింఛను లింకొక 10, 15 కోట్ల రూపాయలుండును. ఇక లెక్కలోనికి రాని వేతనములు బతైములు కలిపినచో సాలుకు 200 కోట్ల రూపాయలు ఖర్చుఅగుచున్నట్లు ఎంచవచ్చునని సుప్రసిద్ధ అర్థశాస్త్రజ్ఞుడగు ప్రొఫెసర్ కె. టి. షాగారు, అంచనావేసినారు. ఇతరదేశములతో పోల్చి చూచినచో నీజీతము లత్యధికముగా నున్నవి. మన ప్రజలా దరిద్రులు. సాలు 1కి తలకు రు 80 రూపాయల దామాషా ఆదాయముగలిగి ఎంత ఎక్కువ మదింపు వేసి చూచినను సాలుకు వేయికోట్ల జాతీయాదాయముగల మనదేశమున కీ జీతముల ఖర్చు దుర్బరముగా నున్నదనియు ఆయన విమర్శించి యున్నారు.

XI

శాసన నిర్మాణాధికారము

భారతదేశ ప్రభుత్వముయొక్క శాసన నిర్మాణాధికారచరిత్ర చాలాచిత్రమైనది. 1833 కి పూర్వము భారతదేశ