బ్రిటీష్‌రాజ్యతంత్రము
113
లెక్కలు తయారుచేయుట, జమీందారురైతుమధ్యశిస్తువ్యాజ్యములు, గవర్నమెంటువారు వ్యవసాయదారులకిచ్చు ఋణములు ఎక్సైజు, ఆదాయవ్యయము, స్టాంపుడ్యూటీ, యితర రివిన్యూ ఆధారములను పరిపాలించుట జిల్లా బొక్కసము (ట్రెజరీ) మేనేజిమెంటు ఇతని ముఖ్యకర్తవ్యములు. ఇతడు రెండుసంవత్సరములశిక్షను వెయ్యిరూపాయల జరిమానాయు విధించవచ్చును. జిల్లాయొక్క శాంతిని కాపాడుట ఈతని కర్తవ్యము. నేరములను అణచుట ఈతని విధి. పోలీసువ్యవహారములపై న ఈతనికి పెత్తనముకలదు. జిల్లాజైలు ఈతని యధికారముక్రింద నుండును. దీనికితోడు పబ్లికువర్క్సు, అడవులు, జైళ్లు, ఆరోగ్యశాఖలు, విద్యశాఖ మునిసిపలు జిల్లాబోర్డులశాఖలు క్రొత్తగా నిర్మింపబడి నందునను ఆయా శాఖల వ్యవహారములపైనగూడ నీతనికి పై తనిఖీచేయవలసినవిధి కలిగినది. సాధారణముగా నితడు జిల్లాబోర్డుకు ప్రెసిడెంటుగా నుండెను. ప్రతిజిల్లా వ్యవహారముల విషయమున ప్రభుత్వమునకు ప్రజలకు మధ్యనుండు నధికారి యితడే. ఈతని సలహానుబట్టియే జిల్లాపరిపాలనమెల్ల నడచుచుండెను. హిందూమహమ్మదీయుల కొట్లాట, దౌర్జన్యముల నివారణ, కఱవుల నివారణ మున్నగు కార్యములనెల్ల నీతడు నిర్వహించవలెను. అనేక అర్జీలు మనవులు నీతడు చిత్తగించవలెను. దరఖాస్తులు మంజూరుచేయవలెను.
కలెక్టర్లకు 1804 సం||రపు రెగ్యులేషనువలన మైనర్లపైన అధికారమును, 1816 రిగ్యులేషనువలన సరిహద్దు తగాదాల పరిష్కారము, 1822 లో గవర్నమెంటు ఆస్తిహరింపు స్వామి