112
భారతదేశమున
ఇతడే ప్రధాన రివిన్యూ ఉద్యోగియు న్యాయవిచారణ చేయు మేజస్ట్రీటును. ప్రథమములో నీరెండు హోదాలు విడివిడిగా నుండెను. గాని తరువాత నీ రెండు నొకే అధికారివలన చలాయింపబడుచుండెను. జిల్లా మేజిస్ట్రీటు సివిలుజడ్జి వంగరాష్ట్రమునప్రారంభములో నొకేయధికారిగానుండెను. జైలువిడుదల సర్క్యూటు కోర్టువలన చేయబడుచుండును. కార౯వాలిసు తరువాత కొన్నినాళ్ళకు జడ్జీ యధికారమునుండి మేజస్ట్రీటు అధికారము విడదీయబడెను. వంగరాష్ట్రము బీహారు ఒరిస్సాలు దివానీగా పొందిన కంపెనీ పరిపాలన స్థాపించినపిదప 1772 లో వార౯ హేస్టింగ్సు కాలములో వంగరాష్ట్రములో కలెక్టరు ఉద్యోగము నిర్ణయింపబడినది. సంయుక్తరాష్ట్ర మదరాసు బొంబాయి రాష్ట్రములలో మేజస్ట్రీటు న్యాయవిచారణాధికారము (రివిన్యూ) భూమిసిస్తుల అధికారమును ఒకే కలెక్టరు చలాయించు పద్ధతి స్థాపింపబడి అదియేతక్కిన రాష్ట్రములలో కూడ అనుకరింపబడినది.
కలెక్టరు రివిన్యూఅధికారము ఆ రాష్ట్రములలోనున్న భూస్వామ్యపద్ధతిపై నాధారపడి యుండెను. వంగరాష్ట్రమున పర్మనెంటు సెటిల్మెంటులోని శాశ్వత సిస్తు వసూలు పద్దతివలన నీతనిపని చాలా తేలిక. మదరాసులో రైత్వారీ పద్దతివలన వేలకొలది వ్యవసాయకులవలన వసూలుచేయవలసిన పని కష్టతరము. అందువలన అసంఖ్యాకులగు గ్రామసిబ్బంది పైన నీతడు అధికారమును కలిగియుండును. కలెక్టరుకు గ్రామస్థుల స్థితిగతులు భూమిపంటలు ధరలు గూర్చిన