Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/604

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114

భారతదేశమున


ద్రోహనేరవిచారణలు, 1831 లో గ్రామోద్యోగ హోదాల దావాల విచారణలు, 1836 లో భూస్వాములకు రైతులకు మధ్య శిస్తువ్యాజ్యముల విచారణలు, 1871 లో మ్యునిసిపలు వ్యవహారములు, 1871 లో రివిన్యూబోర్డుకు ఏజెంటుగా ధర్మాదాయముల వ్యవహారముల అధికారము, కలిగినది. 1817 లో సముద్రతీరప్రదేశములందు సుంకముల, వ్యవహారములు వీరి యధికారము క్రింద జేర్చబడెను.

జిల్లాకు పోలీసుసూపరెంటెండెంటు (ఆంగ్లేయోద్యోగి) జిల్లాకలెక్టరు అధికారముక్రిందనే యుండెను. సివిలుసర్జను కలెక్టరుకు ఆరోగ్యవిషయమునందు సలహాదారుడు. లోకలు ఫండు లేక జిల్లా ఇంజనీరుకూడా ఇంకొక జిల్లాయుద్యోగి.

ఈ కలెక్టరుక్రింద ఆంగ్లేయ అసిస్టెంట్లు జిల్లాభాగముల కధికారులగు సబుకలెక్టర్లు నుందురు. జిల్లా సబుడివిజనులుగా చేయబడి జూనియరు సివిలుసర్వీసు ఆఫీసర్లక్రిందను, రాష్ట్రీయసర్వీసు ఉద్యోగులగు భాగతీయ డిప్యూటీకలెక్టర్లు క్రిందను నుండెను. కలెక్టరుక్రింద శాఖలు 1. నేటీపు కరస్పాండెన్సు నిర్వాహణ (కొర కొక శిరసాదారు.) 2. ఇంగ్లీషు కరెస్పాండెన్సు జనరల్ అక్కవుంటుశాఖ. 3. ట్రెజరీస్టాంపుల శాఖ. 4. ప్రెస్‌శాఖ. 5. ఇతర కార్యాలయనౌకరులు.

ట్రెజరీపైన అధికారమును 2. 3. శాఖలకు మేనేజిమెంటును ఒక నేటివు డిప్యూటికలెక్టరుక్రింద నుండెను. ఈకలెక్టరుల పైనను వీరిక్రింది యధికారు లందరిపైనను రివిన్యూబోర్డు అధికారము కలిగియుండును. మదరాసుజిల్లాలలో 4-5 సబుడివిజను.